తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమాలో తమిళనాడు రాజకీయాల పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలో అన్నాడీఎంకె కార్యకర్తలు 'సర్కార్' సినిమా ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లపై దాడి చేసి పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి పనులు చేశారు.
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'సర్కార్' సినిమాలో తమిళనాడు రాజకీయాల పార్టీలను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని వాటిని తొలగించాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో అన్నాడీఎంకె కార్యకర్తలు 'సర్కార్' సినిమా ప్రదర్శిస్తోన్న కొన్ని థియేటర్లపై దాడి చేసి పోస్టర్లు, బ్యానర్లు చించేయడం లాంటి పనులు చేశారు. కొన్ని చోట్ల షోలను రద్దు చేయించారు.
దీంతో 'సర్కార్' సినిమా వెనక్కి తగ్గక తప్పలేదు. కొన్ని సన్నివేశాలను మ్యూట్ చేస్తున్నట్లు, అలానే అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తున్నట్లు సర్కార్ టీమ్ అనౌన్స్ చేసింది. దీంతో సర్కార్ గొడవ సద్దుమణిగింది. ఈ నేపధ్యంలో సినిమాలో విలన్ పాత్రలో నటించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రభుత్వతీరుపై ఘాటుగా స్పందించింది. ''ఒక సినిమాను చూసి భయపడేంత వీక్ గా గవర్నమెంట్ ఉందా..? మీరు ఏదైతే చేయకూడదో అదే చేస్తూ మీ స్థాయిని మీరే తగ్గించుకుంటున్నారు.
ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయడం మానుకోండి. క్రియేటివిటీ స్వేచ్చను హరించకండి'' అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. మరి దీనిపై అన్నాడీఎంకె నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి!
ఇవి కూడా చదవండి..
సర్కార్ : ఆ డైలాగులు, సీన్ లు తీసేశారు.!
ఆ సెక్షన్ గుట్టు విప్పిన సర్కార్ సినిమా: కోట్ల మంది సెర్చ్ చేస్తున్నారట..!
ఎంత పని చేశావమ్మ... కోమలవల్లీ..!
'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?
థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!
మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!
'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!
రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం
జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!
'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!
'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!
'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!
ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)
'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!
సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?
విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?
ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!
