MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే

Mamidi Konala Meena: యూట్యూబ్‌లో దుమ్మురేపుతోన్న మ‌రో ఫోక్ సాంగ్‌.. పాట వింటే కాలు క‌ద‌పాల్సిందే

Mamidi Konala Meena: తెలంగాణ జానపద సాహిత్యం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. మట్టి వాసన, మనసును తాకే బాణీలతో కూడిన జానపద గీతాలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Feb 27 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మామిడి కోన‌ల మీన
Image Credit : HAMARA VILLAGES/YT

మామిడి కోన‌ల మీన

ఫోక్ సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకుంటున్నాయి. పల్లెటూరి సంస్కృతిని, అక్కడి మనుషుల అనుబంధాలను ప్రతిబింబించే ఈ పాటలు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి సంబంధాలు, ప్రేమ, విరహం వంటి అంశాలపై వచ్చే జానపదాలకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా యూట్యూబ్‌లో విడుదలైన "మామిడి కోనల మీన" (MAMIDI KONALA MEENA) అనే పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక యువతి తన కాబోయే వరుడి గురించి కలలు కంటూ, అతని గురించిన ఆలోచనలను అందంగా పంచుకునే లిరిక్స్ ఆక‌ట్టుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మనసు దోచే భావం
Image Credit : HAMARA VILLAGES/YT

మనసు దోచే భావం

ఈ పాట ఒక స్వచ్ఛమైన గ్రామీణ ప్రేమకథను గుర్తు చేస్తుంది. తన కాబోయే భర్త ఎలా ఉంటాడో, అతని రాక కోసం తాను ఎలా ఎదురుచూస్తున్నానో ఒక యువతి తన మనసులోని మాటను పాట రూపంలో వ్యక్తపరుస్తుంది. ఆత్మీయత, అనురాగం నిండిన పదాలతో సాగే ఈ గీతం వింటుంటే పల్లెటూరి వాతావరణం కళ్లముందు కదలాడుతుంది.

Related Articles

Related image1
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?
Related image2
ఇప్పుడే నిమ్మ ర‌సాన్ని ఇలా స్టోర్ చేసుకుంటే స‌మ్మ‌ర్‌లో బిందాస్‌.. ఒక్క నిమ్మ‌కాయ రూ. 10 కావ‌డం ఖాయం
35
గానం, రచన
Image Credit : HAMARA VILLAGES/YT

గానం, రచన

ఈ పాట ఇంతగా ఆక‌ట్టుకోవ‌డానికి దీని వెనుక ఉన్న టీమ్ అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పాటను ప్రముఖ జానపద గాయని మధు ప్రియ, నాగ‌వ్వ కలిసి ఆలపించారు. మధు ప్రియ గొంతులోని మాధుర్యం, నాగ‌వ్వ గొంతులోని జానపద సొగసు ఈ పాటకు ప్రాణం పోశాయి. కల్యాణ్ కీస్అం దించిన సంగీతం ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంది. ఇక ఈ పాట‌కు కమలేష్ లావత్ (Kamaleslavath) సాహిత్యం అందించారు. తెలంగాణ మాండలికంలో సాగే పదాలు ఎంతో అర్థవంతంగా ఉన్నాయి.

45
యువతను ఆకట్టుకుంటున్న విజువల్స్
Image Credit : HAMARA VILLAGES/YT

యువతను ఆకట్టుకుంటున్న విజువల్స్

కేవలం ఆడియో మాత్రమే కాకుండా, ఈ పాట మేకింగ్, విజువల్స్ కూడా చాలా సహజంగా ఉన్నాయి. ఇందులో కనిపించడం అదనపు ఆకర్షణ. యువతి తన కాబోయే వరుడిని ఊహించుకుంటూ మురిసిపోయే సన్నివేశాలు, పల్లెటూరి లొకేషన్లు ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తున్నాయి. ఇక ఈ పాట‌కు అన్నింటికంటే ప్ర‌త్యే ఆక‌ర్ష‌ణ లీడ్ రోల్‌లో న‌టించిన నాగ దుర్గ‌. ఆమె అద్భుత డ్యాన్స్‌, ట్రెడిష‌న‌ల్ క్యాస్టూమ్స్ బాగున్నాయి. 

55
జానపదానికి పట్టాభిషేకం
Image Credit : HAMARA VILLAGES/YT

జానపదానికి పట్టాభిషేకం

కొత్తదనంతో పాటు మట్టి వాసనను కోరుకునే ప్రేక్షకులకు 'మామిడి కోనల మీన' ఒక చక్కని కానుకగా చెప్పొచ్చు. జానపద పాటలు కేవలం వినోదం మాత్రమే కాకుండా, మన సంస్కృతిని, భాషను తర్వాతి తరానికి ఎలా చేరవేస్తాయో ఈ పాట మరోసారి నిరూపించింది. ఇక‌పై ఎక్క‌డ చూసినా ఈ పాట మారు మోగ‌డం ఖాయమ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?
Recommended image2
ఇప్పుడే నిమ్మ ర‌సాన్ని ఇలా స్టోర్ చేసుకుంటే స‌మ్మ‌ర్‌లో బిందాస్‌.. ఒక్క నిమ్మ‌కాయ రూ. 10 కావ‌డం ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved