MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఒక్కరోజు కూడా భర్తను వదిలి ఉండలేను.. అన్నీ కలిసే చేస్తాం: సమంత

ఒక్కరోజు కూడా భర్తను వదిలి ఉండలేను.. అన్నీ కలిసే చేస్తాం: సమంత

Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన భర్త రాజ్ నిడిమోరు గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తామిద్దరం ఏ పని చేసినా కలిసే చేస్తామని, ఒక్కరోజు కూడా ఆయనకు దూరంగా ఉండలేనని ఆమె ఎమోషనల్ అయ్యారు. 

1 Min read
Author : Pavithra D
Published : Feb 27 2026, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 రాజ్ నిడిమోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు
Image Credit : Samantha\Instagram

రాజ్ నిడిమోరుపై ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రముఖ నటి సమంత తన వ్యక్తిగత జీవితం, తన భర్త రాజ్ నిడిమోరుతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రాబోయే చిత్రం 'మా ఇంటి బంగారం' ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన వైవాహిక జీవితం ఎంత సంతోషంగా సాగుతుందో వివరిస్తూ కొన్ని ఎమోషనల్ విషయాలను పంచుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దూరంగా ఉండటం చాలా కష్టం
Image Credit : Samantharuthprabhuoffl/Instagram

దూరంగా ఉండటం చాలా కష్టం

ఒక ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ, తామిద్దరం ఎప్పుడూ కలిసే ఉంటామని తెలిపారు. "మేమిద్దరం నిజంగా ఒక ఇరిటేటింగ్ కపుల్ లాంటి వాళ్లమే. పని, ప్రయాణాలు, వర్కౌట్స్.. ఇలా ఏది చేసినా కలిసే చేస్తాం. ఒక్క రోజు కూడా ఆయనకు దూరంగా ఉండటం నాకు చాలా కష్టం" అని ఆమె చెప్పుకొచ్చారు. తమ మధ్య ఉన్న బంధం హనీమూన్ దశను దాటి అంతకంటే లోతైన అనుబంధంగా మారిందని ఆమె వివరించారు.

Related Articles

Related image1
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Related image2
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
35
నటిగా ఎదగడానికి ఆయనే కారణం
Image Credit : youtube/@samanthaofficial

నటిగా ఎదగడానికి ఆయనే కారణం

హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో, దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ కాంబినేషన్‌ను ఉదాహరణగా తీసుకుంటూ, రాజ్ పక్కన ఉండటం వల్ల తన నటనలో ఎంతో మెరుగుదల వచ్చిందని సమంత అభిప్రాయపడ్డారు. ఆయన ప్రోత్సాహం వల్ల తాను ఒక మంచి నటిగా మారుతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ పోలికపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.

45
ప్రేమ ప్రయాణం..
Image Credit : Instagram/Samantha

ప్రేమ ప్రయాణం..

సమంత, రాజ్ నిడిమోరుల పరిచయం 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సెట్స్‌లో మొదలైంది. ఆ తర్వాత 'సిటాడెల్: హనీ బన్నీ' కోసం కలిసి పనిచేశారు. 2024లో వీరిద్దరి బంధంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

55
ఈషా ఫౌండేషన్‌లో వివాహం
Image Credit : Instagram

ఈషా ఫౌండేషన్‌లో వివాహం

చివరకు గత ఏడాది డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'మా ఇంటి బంగారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలో సమంత చేసిన వ్యాఖ్యలు ఆమె అభిమానుల్లో ఆనందాన్ని నింపాయి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
సమంత రూత్ ప్రభు

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramba Oorvasi Menaka Review: రంభ ఊర్వశి మేనక మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లరి నరేష్‌ తన జోనర్‌లో హిట్‌ కొట్టాడా?
Recommended image2
Kalpana Rai: ఒళ్ళంతా నగలు, పుట్టుకతోనే కోటీశ్వరురాలు..వెంకీ, చిరు లతో సూపర్ హిట్స్, కానీ చివరికి ఆమె జీవితం
Recommended image3
ఎంత క‌ష్టామైనా రాని.. ఒక్క‌సారి ఈ పాట వినండి. జీవితాన్ని మార్చే గొప్ప సందేశం
Related Stories
Recommended image1
రూ. 100 కోట్ల సినిమా.. కట్ చేస్తే.. తెగింది మాత్రం 20 టికెట్లు మాత్రమే.. ఆ మూవీ ఏదంటే.?
Recommended image2
విజయ్, రష్మిక ఇద్దరిలో చదువులో ఎవరు తోపో తెలుసా.? ఇద్దరి విద్యార్హతలు ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved