తమిళనాడు సినిమాలకు, రాజకీయాలకు విడదీయలేని సంబంధం. తమిళ గడ్డ మీద పూటకో రచ్చ పుడుతూనే ఉంటుంది. గతంలో మెర్సల్ మూవీలో ఒక్క డైలాగ్ కారణంగా దేశమంతా లొల్లి చేశారు. తాజాగా విజయ్ తీసిన మరో సినిమా ‘సర్కార్’ సైతం రాజకీయ వివాదానికి దొరికిపోయింది. ఇందులో.. వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన పాత్ర.. పురచ్చి తలైవి జయలలితను పోలి ఉండడమే గొడవకు మూల కారణం.

‘సర్కార్’ మూవీలో ప్రతినాయకి పాత్రలో నటించిన వరలక్ష్మి పెర్ఫామెన్స్ పరంగా ఇరగదీసిందంటూ కాంప్లిమెంట్స్ వచ్చాయి. కానీ.. అధికార అన్నాడీఎంకే క్యాడర్ మాత్రం ఆమె దొరికితే ‘లేపేస్తాం’ అంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇందులో వరలక్ష్మి రోల్ పేరు.. కోమలవెల్లి..! నిజానికి అన్నాడీఎంకే దివంగత అధినేత్రి జయలలిత మొదటి పేరు కూడా కోమలవెల్లి. సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేముందు ఆమె జయలలితగా మారారు. అందుకే.. జయలలితను ఎంత అభిమానిస్తారో కోమలవెల్లి అనే పేరును కూడా అంతే ఆరాధిస్తారు. మరి ‘కోమలవెల్లి’ అనే పేరు పెట్టుకుని అడ్డమైన డైలాగులూ చెబితే.. ఎవరు మాత్రం ఊరుకుంటారు..?

                                  

ప్తస్తుతానికి అన్నాడీఎంకే కార్యకర్తలు తమిళనాడు వ్యాప్తంగా ఒక్కటై.. థియేటర్ల మీద పడి ఫ్లెక్సీలు, బ్యానర్లు చించెయ్యడం మొదలుపెట్టారు. మదురై, కోయంబత్తూరుల్లో మొత్తం అన్నీ థియేటర్ల వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. తమ ‘ఉద్యమం’ ఉధృతం చేస్తామని కూడా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. అయితే.. ఈ వివాదం ఎంతవరకు వెలుతుందో వేచి చూడాలి.

ఆ సెక్షన్ గుట్టు విప్పిన సర్కార్ సినిమా: కోట్ల మంది సెర్చ్ చేస్తున్నారట..!

'సర్కార్'పై అభ్యంతరం ఎందుకంటే..?

'సర్కార్' వెనక్కి తగ్గిందా..?

థియేటర్లలో సినిమా రద్దు.. 'సర్కార్' కష్టాలు!

మురుగదాస్ అరెస్ట్ పై పోలీసుల క్లారిటీ!

'సర్కార్' వివాదంపై సూపర్ స్టార్ కామెంట్!

రాత్రి మురగదాస్ ఇంటికి పోలీస్ లు, అరెస్ట్ కు రంగం సిద్దం

జయలలితని తప్పుగా చూపిస్తారా..? విజయ్ పై ఫైర్!

'సర్కార్'పై మహేష్ కామెంట్ కి మురుగదాస్ రెస్పాన్స్!

'సర్కార్' పైరసీ ప్రింట్.. తమిళ రాకర్స్ చెప్పిందే చేశారు!

'సర్కార్' HD ప్రింట్ ఆన్ లైన్ లో..!

ఫస్టాఫే సూపర్... (సర్కార్ రివ్యూ)

'సర్కార్' ట్విట్టర్ రివ్యూ.. 

సర్కార్ ప్రీమియర్ షో టాక్!

'సర్కార్' ఫస్ట్ రివ్యూ.. వచ్చేసింది!

సర్కార్ షాకింగ్ బిజినెస్..185 కోట్లా?

విజయ్ సర్కార్.. హడావుడి లేదేంటి?

ఒక్కో థియేటర్‌లో 8 షోలు.. విజయ్ మ్యానియా!

మురగదాస్ కాపీ వివాదం: క్షమాపణ చెప్పి, భాగ్యరాజ్‌ రాజీనామా

'సర్కార్' స్పెషల్ షోలకి నో పర్మిషన్!