మా ఆయన రకరకాల భంగిమలలో శృంగారమంటే చాలా ఇష్టం-షాహిద్ సతీమణి మీరా

First Published 21, Mar 2018, 6:18 PM IST
Shahid wife shares bed room secrets
Highlights
  • తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా చెప్పే అలవాటున్న షాహిద్
  • రియల్ లైఫ్ లో ముద్దు సీన్ల వరకు వెల్లడించిన షాహిద్
  • షాహిద్ భార్య మీరా మాత్రం సెక్స్ భంగిమల వరకు వెళ్లింది

బాలీవుడ్ స్టార్ హీరో షాయిద్ కపూర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్ గా చెబుతాడని బాలీవుడ్ లో టాక్ ఉంది. అయితే షాహిద్ ఒక లెవెల్ వరకు ఎంత చెప్పాలో అంతే చెబుతాడు. కానీ ఆయన సతీమణి మాత్రం లిమిట్ ను దాటేసి ఘాటుగా చెప్పేస్తుందని ఇటీవల వచ్చిన ఇంటర్వ్యూలో బయటపడింది. షాహిద్ రియల్ లైఫ్ లో ముద్దు సీన్ల వరకు వెళితే.. షాహిద్ భార్య మీరా మాత్రం సెక్స్ వరకు వెళ్లింది. 

ఎవరు ఉహించని స్థాయిలో ఘాటుగా చెప్పడంతో ఒక్కసారిగా ఆ న్యూస్ వైరల్ అయ్యింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రీసెంట్ గా నేహా ధూపియా యాంకర్ గా ఉన్న ఒక టాక్ షోలో షాహిద్ దంపతులు పాల్గొన్నారు. అయితే షోలో నేహా ధూపియా నుంచి షాహిద్ కు సెక్స్ పరమైన ప్రశ్న ఎదురైంది. ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అడుగగా.. షాహిద్ షాక్ అయ్యి నోరెళ్లబెట్టాడు.. అయితే ఆయన భార్య మీరా మాత్రం అందుకు సమాధానం చెప్పి షాహిద్ ని మరోసారి ఆశ్చర్యపరిచేలా చేసింది. షాహిద్ కు వివిధ భంగిమలలో శృంగారంలో పాల్గొనడమంటే చాలా ఇష్టమని ఘాటుగా చెప్పేసింది. దీంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

షాహిద్ ఇంతకుముందు కాఫీ విత్ కరణ్ షోలో కేవలం తన భార్యతో ముద్దు పెట్టుకోవడం గురించి మాత్రమే చెప్పాడు. సహజసిద్ధమైన ముద్దులను ఇవ్వడంలో మీరా సూపర్ అని కితాబునిచ్చాడు. కానీ మీరా మాత్రం అంతకు మించిన రేంజ్ లో ఆన్సర్ ఇవ్వడంతో అందరు షాక్ అవుతున్నారు.        


 

loader