- Home
- Entertainment
- TV
- Karthika Deepam 2 Today Episode: దీప గురించి నిజం తెలుసుకున్న కాంచన- అడ్డంగా దొరికిపోయిన కార్తీక్
Karthika Deepam 2 Today Episode: దీప గురించి నిజం తెలుసుకున్న కాంచన- అడ్డంగా దొరికిపోయిన కార్తీక్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (మార్చి 4వ తేదీ)లో శ్రీధర్ పై ఫైర్ అయిన కావేరి. స్వప్నకు అండగా శ్రీధర్. దీప గురించి కాంచనకు చెప్పిన పారు. దాసుకు నిజం చెప్పిన దశరథ. అడ్డంగా బుక్ అయిన కార్తీక్. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో నీ మనసులో ఎంత బాధ ఉందో మాకు తెలుసు మామయ్య. కానీ దీప కడుపులో బిడ్డను వదులుకోవడం తప్ప ఈ సమస్యకు వేరే పరిష్కారం లేదు అంటాడు కార్తీక్. నువ్వు ఏం ఆలోచించకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి బయల్దేరుతారు దీప, కార్తీక్. వీళ్ల మాటలను చాటుగా విన్న పారిజాతం దీప బిడ్డను వదులుకోవడం ఏంటి? ఒక వేళ ఈ మాట నిజం అయితే ఇంకో వ్యక్తికి కూడా చెప్పాలి అని మనసులో అనుకుంటుంది.
శ్రీధర్ పై కావేరి ఫైర్
కూతురికి ఆపిల్ కట్ చేసి ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు శ్రీధర్. కూతురు, అల్లుడికి విడాకులు ఇచ్చి మంచి పని చేసిందని.. ఆపిల్ కట్ చేసి పెడుతున్నారా? ఇంకా కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేయండి బాగుంటుంది అని శ్రీధర్ పై ఫైర్ అవుతుంది కావేరి. విడాకులు ఎక్కడ ఇచ్చింది. పత్రాల మీద సంతకాలే కదా పెట్టింది అంటాడు శ్రీధర్. మీకు నచ్చింది చేయండి అని సీరియస్ గా లోపలికి వెళ్తుంది కావేరి. అమ్మలా నా మీద మీకు కోపం లేదా నాన్న అని తండ్రిని అడుగుతుంది స్వప్న.
స్వప్నకు అండగా శ్రీధర్
అందరిలా ఆలోచించి నేను నిన్ను బాధపెట్టలేను. నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నా. వివాహ బంధాన్ని ఎవరూ కావాలని తెంచుకోరు. ఇష్టపడ్డావు చేసుకున్నావు. ఇష్టం లేదని వద్దనుకున్నావు. దాంట్లో తప్పు ఏం ఉంది? కొన్ని రోజులు ఆగితే నీకు ఏం కావాలో నీకే తెలుస్తుంది. నేను ఎప్పుడూ నా కూతురికి ధైర్యంగానే ఉంటా. నీకు నచ్చింది చేయ్ అని కూతురిని దగ్గరికి తీసుకుంటాడు శ్రీధర్. నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు థాంక్యూ నాన్న అని ఏడ్చేస్తుంది స్వప్న.
నిజం చెప్పిన పారు
మరోవైపు కాంచనకు ఫోన్ చేస్తుంది పారిజాతం. ఏంటి పిన్ని ఈ టైంలో కాల్ చేశావు అని అడుగుతుంది కాంచన. నువ్వు నా కడుపులో పుట్టకపోయినా నేను ఎప్పుడు నీ మంచే కోరుకుంటాను అంటుంది పారు. నిజమే అని వెటకారంగా అంటుంది కాంచన. నీకు ఒక విషయం చెప్పడానికి ఫోన్ చేశాను అని దీప కడుపులో బిడ్డను వద్దు అనుకుంటోంది. నీ కొడుకు, కోడలు, మీ అన్నయ్య మాట్లాడుకుంటుంటే విన్నాను అని బాంబ్ పేలుస్తుంది పారు. దీప ఎందుకు అలా అనుకుంటుంది అని కంగారు పడుతుంది కాంచన. ఏమో దాని వెనుక ఉన్న కారణం నువ్వే తెలుసుకోవాలి అని కాల్ కట్ చేస్తుంది పారు.
అనుమానం రాదా?
మరోవైపు దీప, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. రేపు హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి వెళ్లాలి కదా.. అత్తతో ఏం చెప్తావని కార్తీక్ ని అడుగుతుంది దీప. నిజం ఒకటే ఉంటుంది కానీ. అబద్ధాలు ఎన్నైనా చెప్పొచ్చు. అమ్మతో కూడా అబద్ధమే చెప్తాను అంటాడు కార్తీక్. ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చే పని అయితే నువ్వు ఏం చెప్పినా ఏం కాదు. కానీ మనం హాస్పిటల్లో ఉండాలి కదా... అనుమానం రాదా? అంటుంది దీప.
నేను అంతదూరం ఆలోచించలేదు దీప. కానీ ఏదో ఒకటి చెప్తాను. శౌర్య, అనసూయ పెద్దమ్మ, అమ్మ.. అందరికీ ఒకటే విషయం చెప్పి బయటకు వెళ్దాం అంటాడు కార్తీక్. అత్తకు బిడ్డ గురించి మాట ఇచ్చాను. తర్వాత తనకి ముఖం చూయించలేను అంటుంది దీప. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అంటాడు కార్తీక్. అమ్మ పరిస్థితి చూశావు కదా.. ఏమైనా సరే మా అమ్మను కాపాడుకోవాలి అంటుంది దీప. ఏం జరిగినా నువ్వు రేపు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నావు. మన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని చెప్తాడు కార్తీక్.
బిడ్డకు ఏం కాదు..
మరుసటి రోజు ఉదయం దాసును కలుస్తాడు దశరథ. ఏంటి అన్నయ్య అలా ఉన్నావు. నా కూతురు మళ్లీ ఏమైనా చేసిందా అని ఆవేశంగా అడుగుతాడు దాసు. చేస్తే ఏం చెస్తావురా అంటాడు దశరథ. శిక్ష వేస్తాను అన్నయ్య. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలి అంటాడు దాసు. అయితే నాకే చాలా పెద్ద శిక్ష వేయాలి. నేను తప్పు కాదు పాపం చేస్తున్నాను అంటాడు దశరథ. అదేంటి అన్నయ్య ఏమైంది అని అడుగుతాడు దాసు.
నేను నీతో తప్ప, ఇంకెవరితో ఈ విషయం చెప్పుకోలేను అని బాధపడతాడు దశరథ. ఏమైందో చెప్పు అన్నయ్య అంటాడు దాసు. దీప, మీ వదినను కాపాడాలంటే తన కడుపులో బిడ్డను వదులుకోవాలి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. దీప రాతను ఎంత రాతి గుండె రాసిందో అన్నయ్య.. అన్నీ కష్టాలే.. కానీ దీప కడుపులో బిడ్డకు ఏం కాదు. అది కూడా వాళ్ల అమ్మలాగే కష్టాలను తట్టుకొని నిలబడుతుంది. మృత్యుంజయురాలు అవుతుంది. నా మాట నమ్ము అని దశరథకు ధైర్యం చెప్తాడు దాసు.
అడ్డంగా దొరికిపోయిన కార్తీక్
మరోవైపు శ్రీధర్ ని ఇంటికి పిలిపిస్తుంది కాంచన. పారిజాతం చెప్పిన విషయాన్ని శ్రీధర్, అనసూయలకు చెప్తుంది. పారిజాతాన్ని నమ్మొద్దు, ఆమె మంచి మనసులను కూడా కలుషితం చేయగలదు అంటుంది అనసూయ. అవును అంటాడు శ్రీధర్. లేదండి, వీళ్ల చేష్టలు చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది అంటుంది కాంచన.
ఇంతలో దీప, కార్తీక్ లాగేజ్ బ్యాగ్ తో వస్తారు. ఆ బ్యాగ్ ఏంటి అని అడుగుతుంది కాంచన. దీప నేను సరదాగా కొన్ని రోజులు బయటకు వెళ్లాలని అనుకుంటున్నాము అని చెప్తాడు కార్తీక్. ఇంకా ఎందుకురా నా దగ్గర నిజాలు దాస్తున్నారు? పారిజాతం పిన్ని నాతో అంతా చెప్పింది అంటుంది కాంచన. షాక్ అవుతారు దీప, కార్తీక్. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

