MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Balakrishna: బాలకృష్ణ కెరీర్‌లో పెద్ద సెన్సేషన్.. అలాంటి రోల్‌లో నటించబోతున్న నందమూరి వారసుడు

Balakrishna: బాలకృష్ణ కెరీర్‌లో పెద్ద సెన్సేషన్.. అలాంటి రోల్‌లో నటించబోతున్న నందమూరి వారసుడు

Balakrishna: నందమూరి బాలకృష్ణ తన 111వ చిత్రంలో ముంబై అండర్‌వరల్డ్ డాన్‌గా కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం.. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ ఫామ్‌‌లో వరుస సినిమాలను..
Image Credit : Twitter

సూపర్ ఫామ్‌‌లో వరుస సినిమాలను..

నందమూరి బాలకృష్ణ తన హిట్‌ల పరంపరను కొనసాగిస్తూనే సూపర్ ఫామ్‌‌లో వరుస సినిమాలను ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన 111వ చిత్రాన్ని దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేయడానికి సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'వీరసింహారెడ్డి' భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య పోషించబోయే పాత్రకు సంబంధించిన లీక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ముంబై మాఫియా నేపథ్యంలో కథ
Image Credit : Nandamuri Balakrishna\Instagram

ముంబై మాఫియా నేపథ్యంలో కథ

తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం ముంబై అండర్‌వరల్డ్ మాఫియా నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ అడ్వెంచర్ అని తెలుస్తోంది. ఇందులో బాలకృష్ణ ముంబైని శాసించే ఒక శక్తివంతమైన 'డాన్' పాత్రలో కనిపించబోతున్నారట. అండర్‌వరల్డ్ నేపథ్యంలో బాలయ్య సినిమా చేసి చాలాకాలం కావడంతో, అభిమానులు ఈ వార్త విని ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ పాత్ర కోసం బాలయ్య తన లుక్‌ను కూడా కొత్తగా తీర్చిదిద్దుకుంటున్నట్లు సమాచారం.

35
లుక్ టెస్ట్, కసరత్తులు
Image Credit : facebook.com/NandamuriBalakrishna

లుక్ టెస్ట్, కసరత్తులు

దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ పాత్రను చాలా గంభీరంగా డిజైన్ చేశారట. ఇందుకోసం ఇటీవల బాలయ్యపై ప్రత్యేకంగా 'లుక్ టెస్ట్' కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. పాత్రకు తగిన గంభీరత కోసం బాలకృష్ణ తన శరీర ఆకృతిని మెరుగుపరుచుకునే పనిలో ఉన్నారు. నిత్యం జిమ్‌లో కసరత్తులు చేస్తూ ఈ రోల్ కోసం సిద్ధమవుతున్నారు. మార్చి 6 నుంచి ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

45
భారీ తారాగణం
Image Credit : youtube/@14ReelsPlus

భారీ తారాగణం

ఈ సినిమాలో బాలయ్య సరసన స్టార్ హీరోయిన్ నయనతార నటించబోతోందని టాక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో, ఈ జోడీ మళ్ళీ మ్యాజిక్ రిపీట్ చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై నిర్మాత కిలారు వెంకటసతీష్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు.

55
 అండర్‌వరల్డ్ నేపథ్యంలో..
Image Credit : Asianet News

అండర్‌వరల్డ్ నేపథ్యంలో..

మొత్తానికి, ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో బాలయ్య డాన్ అవతారం ఎత్తడం అనేది ఈ ఏడాది టాలీవుడ్‌లో అతిపెద్ద సెన్సేషన్ కాబోతోంది. గోపీచంద్ మలినేని తన మార్కు మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Singh: బతుకుతానో లేదో తెలియదు, అద్ధంలో ముఖం చూసుకుంటే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రియాంక సింగ్ ఎమోషనల్ కామెంట్స్
Recommended image2
Indian 3: రెండోది అట్టర్ ఫ్లాప్, అయినా మూడోది మొదలు పెట్టిన శంకర్.. వార్ మోడ్‌లో 'భారతీయుడు 3' షురూ
Recommended image3
Nana Patekar: హీరో హీరోయిన్లని డామినేట్ చేసిన నానా పటేకర్.. నేషనల్ అవార్డు కొట్టిన ఆ మూవీ మిస్ కావొద్దు
Related Stories
Recommended image1
నా జీవితంలో జ్యోతిష్యుడు చెప్పినట్టే జరిగింది.. అమలాపాల్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved