MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • TV
  • Gunde Ninda Gudi Gantalu: చింటూతో రోహిణీ.. రెడ్ హ్యాండెడ్ గా బాలుకి దొరికిపోయిందా..?

Gunde Ninda Gudi Gantalu: చింటూతో రోహిణీ.. రెడ్ హ్యాండెడ్ గా బాలుకి దొరికిపోయిందా..?

 Gunde Ninda Gudi Gantalu: రోహిణీ తల్లి చేసిన అవమానానికి బాలు, మీనా చాలా బాధపడతారు. మరోవైపు మౌనిక తల్లి అయినందుకు మొక్కు తీర్చుకోవడానికి ఫ్యామిలీ మొత్తం గుడికి వెళతారు. 

3 Min read
Author : ramya Sridhar
Published : Mar 04 2026, 08:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Gunde Ninda Gudi Gantalu
Image Credit : Jio Hotstar

Gunde Ninda Gudi Gantalu

గుడిలో మొక్కు తీర్చుకోవడానికి ఫ్యామిలీ మొత్తం వస్తారు. కానీ.మీనా రాదు. దీంతో.. మీనాకి బాధ్యత లేదు అని ప్రభావతి చాలా మాటలు అంటుంది. కనీసం పూల మాల కూడా తీసి పెట్టలేదు అని తిడుతుంది. అప్పుడే ఓ పూలు అమ్మే ఆవిడ వచ్చి.. మీనా చెప్పిందని తాజాగా రెండు పూల మాలలు ఇస్తుంది. దీంతో.. బాలు, సత్యం,మౌనిక మీనాని మెచ్చుకుంటారు. పూలు అమ్ముకునే దానికి పూలు అమ్ముకునే ఆవిడ తెలియడంలో గొప్పేమి ఉంది అని ప్రభావతి విమర్శిస్తుంది.

ఇక.. గుడి లోపల మౌనిక పేరిట స్పెషల్ పూజ చేయడానికి పూజారితో మీనా ఆల్రెడీ మాట్లాడేస్తుంది. అంతేకాదు.. వెయ్యి నూట పదహార్లతో టికెట్ కూడా కొని పంపుతుంది. దానికి కూడా ప్రభావతి మెచ్చదు. ఆ తర్వాత అమ్మవారికి సారె పెట్టాలని తెచ్చావా అని రోహిణీని అడుగుతుంది. రోహీణీ అసలు తనకు సారె అంటే ఏంటో కూడా తెలీదు అంటుంది. దీంతో.. అందరూ ప్రభావతిని విమర్శిస్తారు. అప్పుడే.. ఒక పెద్దావిడ మీనా చెప్పిందని.. అమ్మవారికి పెట్టడానికి సారె తీసుకువస్తుంది. మీనా అక్కడ లేకపోయినా అన్ని ఏర్పాట్లు చేసినందుకు బాలు, సత్యం పొంగిపోతారు. తన భార్యను తక్కువ చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చింటూ దగ్గరకి మనోజ్..
Image Credit : Jio Hotstar

చింటూ దగ్గరకి మనోజ్..

ఆ తర్వాత అన్నదానం గురించి కనుక్కోమని సత్యం.. రవికి చెబుతాడు.అయితే..ఆ ఏర్పాట్లు కూడా మీనా పూర్తి చేసిందని రవి చెబుతాడు. ఇక.. తనకు అర్జెంట్ పని ఉందని మనోజ్ బయలుదేరతాడు. వెనకాలే రోహిణీ వెళ్లి.. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడుగుతుంది. ‘ హెల్త్ బాలేదని మీ ఫ్రెండ్ వింధ్య లక్ష రూపాయలు తీసుకుంది.. ఇప్పటి వరకు వడ్డీ ఇవ్వలేదు.. ఇంటికి వెళ్లి వసూలు చేస్తాను’ అని మనోజ్ అంటాడు. అక్కడికి వెళ్తే.. చింటూ, వాళ్ల అమ్మ కనిపిస్తారని భయపడిన రోహిణీ.. మనోజ్ ని మళ్లీ మాయ చేస్తుంది. నేనే వెళ్లి.. వడ్డీ తీసుకువస్తాను అని మనోజ్ ని నమ్మిస్తుంది.

రోడ్డు మీద చింటూ, సుగుణమ్మ నడుచుకుంటూ వెళ్లడం.. అటువైపే రోహిణీ వెళ్లడం.. బాలు ఫ్రెండ్ రాజేష్ చూస్తాడు. ఆ విషయం వెంటనే బాలుకి చెప్పాలి అనుకుంటాడు. వెంటనే ఫోన్ చేసి విషయం చెబుతాడు. చింటూతో పెద్దావిడ వెళ్లిన వీధిలోకే రోహిణీ కూడా వెళ్లింది అని రాజేష్ చెబుతాడు. తనకు ఏదో అనుమానంగా ఉంది అని రాజేష్ చెప్పగానే.. అది తేల్చడానికి బాలు బయలుదేరుతాడు. అయితే.. వెళ్తున్న బాలుకి ప్రభావతి ఆపుతుంది. పని తప్పించుకోవడానికి వెళ్తున్నావా అంటే... పని కోసమే వెళ్తున్నాను అని చెప్పి బాలు వెళ్లిపోతాడు.

33
రోహిణీతో చింటూ.. అక్కడికి వచ్చిన బాలు..
Image Credit : Jio Hotstar

రోహిణీతో చింటూ.. అక్కడికి వచ్చిన బాలు..

ఇక.. మౌనిక.. ఒంటరిగా కూర్చొని సంజూ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. సత్యం వచ్చి కూతురిని యోగ క్షేమాలు అడుగుతాడు.నువ్వు తల్లికాబోతున్నావ్ అంటే... నీ భర్త ముఖంలో సంతోషం లేదు ఏంటి? అని సత్యం అడుగుతాడు. కానీ.. మౌనిక తన బాధను బయటకు చెప్పకుండా లోలోపలే బాధపడుతుంది. దీంతో సత్యం మరీ మరీ అడుగుతాడు. పెళ్లి జరిగింది కాబట్టి.. అత్తింట్లోనే ఉండాలి అనే చాదస్తం తనకు లేదని.. ఏదైనా బాధ ఉంటే చెప్పమని సత్యం అడుగుతాడు. ఆ మాటలకు మౌనిక గుక్క పట్టి ఏడ్చేస్తుంది. దీంతో.. తన అనుమానమే నిజమైందని సత్యం భయపడతాడు. నిజంగానే నీ కాపురం సరిగా లేదామ్మా.. చెప్పు తల్లి అని అడుగుతాడు. నీకు కష్టం ఉంటే.. పుట్టింటికి తెచ్చుకుంటాను అని మరీ మరీ అడుగుతాడు. అయితే.. తనకు వస్తున్న బాధను మనసులోనే దాచుకొని.. తనకు ఎలాంటి కష్టం లేదు అని మౌనిక కవర్ చేస్తుంది. సత్యం ఎంత రెట్టించి అడిగినా.. మౌనిక బయటపడదు. పిల్లలు అప్పుడే వద్దని సంజూ అనుకున్నాడని..కవర్ చేస్తుంది.

ఇక.. రోహిణీ.. చింటూ దగ్గరకు వెళ్తుంది. కొడుకుతో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటుంది. అయితే.. బాలు, మీనాలను అవమానించినందుకు రోహిణీనే కారణం అని సుగుణమ్మ లోలోపల ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ కోపాన్ని రోహిణీ మీద చూపిస్తుంది. ఇంత సేపు ఎందుకు ఉన్నావ్.. నా మనవడిని చూసుకోవడానికి నేను ఉన్నాను.. వెళ్లిపో అని అంటుంది. అప్పుడే చింటూ వచ్చి.. రోహిణీని అమ్మ, అత్త అని పిలుస్తాడు. బాలు, మీనా చాలా మంచివారని.. వాళ్లకు నన్ను దత్తత ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు నేను నీ దగ్గరే ఉంటాను అని అడుగుతాడు. ఎవరూ లేనప్పుడు మాత్రమే అమ్మ అని పిలుస్తాను అని చెబుతాడు. ఆ మాటలకు రోహిణీ బాధ పడుతుంది. కానీ.. చింటూని సుగుణమ్మ దగ్గరకు తీసుకొని సర్ది చెబుతుంది. ఇక.. రోహిణీ వీళ్ల దగ్గరే ఉంటుంది.. సరిగ్గా అక్కడికి బాలు వస్తాడు. మరి.. చింటూతో రోహిణీని చూస్తాడో లేదో రేపటి ఎపిసోడ్ లో తేలనుంది. మరోవైపు రోహిణీ తన మలేషియా మామయ్య అంటూ.. మటన్ కొట్టు మాణిక్యాన్ని పరిచయం చేస్తుంది. అతను కూడా ప్రభావతి వాళ్లు ఉన్న గుడికే వస్తాడు. మరి, అతని నోట నిజం బయటకు వస్తుందో లేదో చూడాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Bigg Boss Telugu 10: పల్లవి ప్రశాంత్ ను మించిపోయిన ఝాన్సీ, సింపతీ కోసం ప్రయత్నిస్తోందా?
Recommended image3
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Related Stories
Recommended image1
Gunde Ninda Gudi Gantalu:గుణకి వీడియో పంపిన రోహిణీ..‘మౌనిక కడుపులో బిడ్డకు నేను కారణం కాదు’ బాంబు పేల్చిన సంజూ
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved