Asianet News TeluguAsianet News Telugu

మా సినిమా వాళ్లు వేసిన బిక్షే నీ రాజకీయ జీవితం

  •  టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరిపై విమర్శలు కురిపించారు
  • ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ “చంద్రబాబును ఏ విధంగా నమ్మి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి​
Posani fired on chandra babu

 టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరిపై విమర్శలు కురిపించారు.సినిమా వాళ్ళపై విమర్శలు చేసిన రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శక నిర్మాత రచయిత పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ “చంద్రబాబును ఏ విధంగా నమ్మి ప్రత్యేక హోదా కోసం పోరాడాలి ..Posani fired on chandra babu

కాసేపు ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అంటాడు.అందుకు అప్పట్లో అసెంబ్లీలో కేంద్ర సర్కారును అభినందిస్తూ తీర్మానం చేసి మరి ఏకంగా కేంద్రానికి పంపారు.అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి సన్మానం చేశారు .మమ్మల్ని ఏసీ రూమ్లో కూర్చొని ఉంటామని అంటున్నారు.అవును మాకు చేతకాదు .అధికారంలో ఉన్న మీరు ఏమి చేశారు.నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అనుభవించి ఇప్పుడు ప్రజలు తిరగబడ్డారు అని ప్రత్యేక హోదా కావాలంటున్నారు.ఒకవేళ మేము వచ్చిన కేంద్రం ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తాం అంటే మీరు తలోగ్గుతారు.

అప్పుడు మా పరిస్థితి ఏమిటి ..మేము ఎటు పోవాలి .అయిన మా సినిమా వాడు పెట్టిన పార్టీ వలన మీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు అనే సంగతి మరిచిపోయారా..1983లో ఢిల్లీ సాక్షిగా ఎన్టీఆర్ మీద పోటి చేస్తా అని బీరాలు పలికి ఆ తర్వాత ఘోరంగా ఓడిపోయాడు .ఓడిపోయి రామకృష్ణ స్టూడియో గోడలు దూకి మరి ఎన్టీఆర్ కాళ్ళు పట్టుకొని పార్టీలోకి వచ్చి..వెన్నుపోటు పొడిచి అన్నం పెట్టినోడికి సున్నం పెట్టాడు అని ఆయన నిప్పులు చెరిగారు .మేం ఏసీ రూముల్లో కూర్చొని కులుకుతామని టీడీపీ నాయకులు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios