జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకే వేదికపై వీరిద్దరి చూడడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. అలానే నటుడు జగపతి బాబు కూడా ఎంతో సంతోషించారు.

బాలయ్య, ఎన్టీఆర్ లను ఒకే స్టేజ్ పై చూడాలనేది తన కోరిక అని ఇప్పటికి తీరిందని అన్నారు. ''2010లో హీరోగా నా కెరీర్ ముగిసిపోయింది. 2012లో బాలయ్య బాబు నటించిన 'లెజెండ్' సినిమాలో జితేంద్ర అనే పాత్రతో నా కెరీర్ మళ్లీ ప్రారంభమైంది.

అప్పుడు బాలయ్యని చూస్తే ఎలా అనిపించిందో.. ఇప్పుడు తారక్ ని చూస్తున్నా.. అదే అనిపిస్తుంది. ఇద్దరూ సినిమాలో నా పాత్ర బాగుండాలని శ్రద్ధ తీసుకున్నారు. 'నాన్నకు ప్రేమతో' సినిమా చేస్తోన్న సమయంలో నేను తారక్ మాట్లాడుకున్నప్పుడు బాలయ్యని, నిన్ను ఒకే స్టేజ్ మీద చూడాలనుకుంటున్నట్లు తారక్ కి చెప్పాను.

దానికి తారక్.. 'బాబు.. ఆయన నా బాబాయ్.. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం' అని అన్నాడు. నేనెప్పుడూ ఏ నటుడితో ఫోటో దిగలేదు. కానీ ఇవాళ బాలయ్య, తారక్ లతో ఫోటో దిగాను. నందమూరి అభిమానులు చాలా మంచివాళ్లు.. వారంతా కలిసే ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు..

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!