నందమూరి బాలకృష్ణ ఇచ్చే స్పీచ్ లు అప్పుడప్పుడు అర్ధమయ్యే విధంగా ఉన్నా.. మరికొన్ని సార్లు మాత్రం అర్ధం చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఆయన స్పీచ్ లలో సంస్కృతం కూడా పొంగి పొర్లుతుంటుంది.

ఆదివారం జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో బాలయ్య ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హీరోయిన్ పూజా హెగ్డేపై బాలయ్య చెప్పిన కవితపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

పూజా హెగ్డే కోసం ఆయన హిందీలో చెప్పిన కవితకి తెలుగులో అర్ధం చెబితే బాగుండు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ బాలయ్య చెప్పిన కవితేంటంటే.. ''లగ్తాహై ఆస్మాన్‌ సే ఫరిస్తా ఉతర్‌కే సంగ్‌మే మరమరాన్‌మే బనాలేంగే.. హర్‌ ఖలీ మస్తే .. పత్తీ పత్తీ గులాబ్‌ హోజాతీ హై..'. ఈ కవిత తమకి అర్ధం కాలేదని అంటున్నారు కొందరు నెటిజన్లు.

మరికొందరు అమ్మాయిలను పడేయాలంటే బాలయ్య దగ్గర ట్రైనింగ్ కోసం వెళ్లాల్సిందే అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఫ్లర్టింగ్ అనేది ఒక యూనివర్సిటీ అయితే బాబు దానికి ఎండీ' అని మరికొందరు విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య.. హీరోయిన్ పై చెప్పిన కవిత ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది.  

సంబంధిత వార్తలు..

ఏ యాక్టర్ తో ఫోటో దిగలేదు.. కానీ వీరితో దిగా: జగపతిబాబు

తారక్, నేను చేసే సినిమాలు మరెవరూ చేయలేరు: నందమూరి బాలకృష్ణ!

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!