నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!
యంగ్ టైగర్ ఎన్‌టిఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు.
యంగ్ టైగర్ ఎన్‌టిఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు. ఈ వేడుకలో టెక్నీషియన్స్,నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లందరికీ మూమెంటోలను అందజేశారు. ఈ సంధర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ''సినిమా చూసినప్పుడు రాయలసీమ స్లాంగ్ తమ్ముడి నోటిలో నుండి వింటుంటే అక్కడ పుట్టి పెరిగిన వారు మాట్లాడినట్లుగా అనిపించింది.
అంత బాగా మాట్లాడాడు. త్రివిక్రమ్ కి సినిమా క్లైమాక్స్ చాలా బావుందని, మంచి పాయింట్ తో సినిమా తీశారని చెప్పాను. ఫుల్ ఎమోషన్ తో సినిమాను తెరకెక్కించారు. జగపతిబాబు పాత్ర కారణంగానే తారక్ పాత్ర మరింత ఎలివేట్ అయింది. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు తమ్ముడు నాతో అన్నాడు..
సినిమాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారని.. నిజంగానే ప్రతి ఒక్కరూ అధ్బుతంగా నటించారు. తమన్ ఇచ్చిన రీరికార్డింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇళయరాజా రేంజ్ లో కొట్టాడు. ఎన్‌టిఆర్ బయోపిక్ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బాబాయ్ ఈ వేడుకకి రావడానికి ఒప్పుకున్నారు. ఈ వేడుకలో నాన్నగారు లేరనే లోటుని మా బాబాయ్ తీర్చేశారు'' అంటూ చెప్పారు.
సంబంధిత వార్తలు..
బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!
అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?
'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!
'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!
త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!
'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!
'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!
అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!
అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!
త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్