యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ విచ్చేశారు.

ఈ సంధర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ''తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించిన శ్రామికుడు, చైతన్య రథసారధి మా అన్నయ్య నందమూరి హరికృష్ణ మరణం నన్ను వేదనకి గురి చేసింది. దేన్నైనా ఎదుర్కొని ముందుకు సాగే ధైర్యశాలి ఆయన మనముందు లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నా.. తొలిదినాల్లో నాన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఆయనకి చేదోడువాదోడుగా నిలుస్తూ కొడుకుగా తన బాధ్యతలు నిర్వహించాడు.

ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నగారి మరణాంతరం హిందూపురం ఉపఎన్నికల్లో అత్యంత మెజారిటీ 60 వేల ఓట్ల మెజారిటీ సాధించిన రికార్డ్ హరికృష్ణ గారి సొంతం. రైతులకి బాసటగా నిలిచారు. కండక్టర్లుగా మహిళలకు ఉపాధి కల్పించారు మా అన్నయ్య నందమూరి హరికృష్ణ గారు. ఆయనకి జోహార్లు.. ఇక 'అరవింద సమేత' సినిమా సక్సెస్ మీట్ కి వచ్చిన అభిమానులకి నా అభినందనలు. 

ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. నేను ఎన్‌టి‌ఆర్ బయోపిక్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా చూడలేకపోయాను. కానీ సినిమా ఇతివృత్తం అడిగి తెలుసుకున్నాను. ఆడవాళ్ళ గొప్పతనం గురించి ఈ సినిమా చెప్పారని తెలిసి నాకు లెజెండ్ సినిమా గుర్తొచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ అందంగా సినిమాని చూపించగలడు. 

తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకుడు త్రివిక్రమ్. ఎంతోమంది భూమి మీద పుడతారు, గిడతారు. కానీ అందరూ మహానుభావులు కాలేరు.. బాధ్యతని నిర్వహించి ముందుకు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు.. అటువంటి వ్యక్తి జగపతిబాబు. పోటీ లేనిదే ఏ రంగంలోనూ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు.. అంత ప్రోత్సాహాన్ని ఇవ్వవు. పోటీ అనేది ఉండాలి కానీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి.

సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి లాంటి మహాకవులు ఈ సినిమాకి పని చేశారు. తమన్ అధ్బుతమైన బాణీలు అందించారు. సంగీతం హిట్ అయితే సినిమా సగం హిట్ అయినట్లే.. నేను, తారక్ చేసే సినిమాలు చేయడం మరెవరి వల్ల కాదు.. లార్జర్ థాన్ లైఫ్ సినిమాలు చేస్తాం.. నవరసాలు ఉన్న సినిమాలు చేస్తాం. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలి. ఈ సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన అభిమానులకు మరోసారి నా కృతజ్ఞతలు'' అంటూ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు..

బాబాయ్ కోసం తారక్ ఎమోషనల్ స్పీచ్.. @ అరవింద సమేత సక్సెస్ మీట్!

నాన్న లేని లోటుని బాబాయ్ తీర్చేశారు: కల్యాణ్ రామ్!

బాలయ్య చేతుల మీదుగా తారక్ కి షీల్డ్!

అరవింద సక్సెస్ మీట్ లో బాలయ్య.. ఇప్పుడే ఎందుకు వస్తున్నట్టు?

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!