విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తీస్తున్న సినిమా ‘యన్‌.టి.ఆర్‌’. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం ‘యన్‌.టి.ఆర్‌-కథానాయకుడు’ జనవరి 9న విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో రకరకాల వార్తలు ఈ సినిమా గురించి మీడియాలో ప్రచారంలోకి వస్తున్నాయి. కొందరు తమ అభిమానాన్ని సినిమాపై ప్రదర్శిస్తే మరికొందరు కావాలని రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓ కొత్త గాసిప్ మొదలైంది.

ఆ రూమర్ ఏమిటంటే..ఈ సినిమాకు క్రిష్ నామ మాత్ర దర్శకుడే అని, బాలయ్య మొత్తం డైరక్ట్ చేసారని ప్రచారం చేస్తున్నారు. బాలయ్య తన తండ్రిలా కనిపించే సీన్స్ అన్నిటికీ క్రిష్ కేవలం దర్శకత్వ పర్య వేక్షణ చేసారట. ఆ సన్నివేశఆలను స్వయంగా బాలయ్యే షూట్ చేసుకున్నారట. ఈ టాక్ ని కొన్ని మీడియా సంస్దలు వైరల్ చేస్తున్నాయి.  

అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..తన తండ్రి పాత్రలో తను నటిస్తున్నారు కాబట్టి ఏమన్నా కథకు, తన పాత్రకు ఇన్ఫర్మేషన్ ని డైరక్టర్ తో పంచుకున్నారేమో కానీ, బాలయ్య అలా డైరక్టర్ ని ప్రక్కన పెట్టి సినిమా డైరక్ట్ చేసే నటుడు కాదు. సెట్ కు వచ్చాక పొరపాటున కూడా డైరక్టర్ విషయంలో వేలు పెట్టడం చెయ్యడని చెప్తారు. అదే ఈ సినిమాకు జరిగి ఉంటుంది. కావాలని పుట్టించే రూమర్స్ ని పట్టించుకోకుండా ఉండటమే మంచింది. 

ఇక బాలయ్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ..‘ఈ బయోపిక్‌ ఒక పార్టీకి, ఒక వర్గానికి పరిమితం కాదు. అందరూ ఆదరించే నాయకుడు ఎన్టీఆర్‌. అందుకే ఆయన్ని మహానాయకుడు అంటుంటారు. వారికి మరణం, పుట్టుకలు ఉండవు. అలాంటి వ్యక్తి కొడుకుగా ఆయన పాత్ర చేయడం గొప్పగా భావిస్తున్నా. రెండు భాగాల్ని ఇంత త్వరగా తీయడం విశేషం. 

రెండో భాగానికి సంబంధించి మరో పది రోజుల షూటింగ్‌ ఉంది. దర్శకుడు క్రిష్ నాతో ఇంతకు ముందు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేశారు. మన ప్రాచీన తెలుగు చరిత్ర సృష్టికర్త గౌతమిపుత్ర శాతకర్ణి అయితే.. మన ఆధునిక తెలుగు జాతి చరిత్ర సృష్టికర్త తారక రామారావు గారు. ఆయన జీవిత కథను సినిమాగా తీయడం అనేది ఓ సంకల్పం’ అన్నారు.

సంబంధిత వార్తలు.. 

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?