MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic Postponed: టాక్సిక్ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ ఇదే.. బాక్సాఫీసు వద్ద `దురందర్‌ 2` ఊచకోత

Toxic Postponed: టాక్సిక్ రిలీజ్ వాయిదా, కొత్త డేట్ ఇదే.. బాక్సాఫీసు వద్ద `దురందర్‌ 2` ఊచకోత

Toxic Postponed: రాకింగ్ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమా రిలీజ్ డేట్ మారింది. మార్చి 19న రావాల్సిన ఈ సినిమాను వాయిదా వేశారు.దీంతో `దురందర్‌ 2` లైన్‌ క్లీయర్‌ అయ్యింది. బాక్సాఫీసు వద్ద ఈ మూవీకి తిరుగే లేదని చెప్పొచ్చు.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 04 2026, 10:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టాక్సిక్ సినిమా రిలీజ్‌ వాయిదా
Image Credit : stockPhoto

టాక్సిక్ సినిమా రిలీజ్‌ వాయిదా

`కేజీఎఫ్‌ 2` లాంటి సంచలన మూవీ తర్వాత యష్ చాలా గ్యాప్‌ తీసుకొని చేసిన సినిమా `టాక్సిక్‌`. మహిళా దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌ రూపొందించిన ఈ చిత్రంలో నయనతార, రుక్మిణి వసంత్‌, కియారా అద్వానీ వంటి హీరోయిన్లు నటిస్తున్నారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదల కావాల్సి ఉంది. అందుకు సంబంధించిన భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యష్‌ అభిమానులు కూడా సినిమా కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు, సినీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది టీమ్‌. రిలీజ్‌ని వాయిదా వేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 టాక్సిక్‌ కొత్త రిలీజ్‌ డేట్‌.. వాయిదాకి కారణం
Image Credit : Asianet News

టాక్సిక్‌ కొత్త రిలీజ్‌ డేట్‌.. వాయిదాకి కారణం

మార్చి 19కి బదులుగా జూన్ 4న 'టాక్సిక్' సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని యశ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. చిత్ర బృందం సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది. అదే రోజున రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్-2' వస్తుండటంతో పోటీని నివారించేందుకే 'టాక్సిక్' వెనక్కి తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీని వాయిదా వేయడానికి కారణం వేరే ఉంది. సినిమాని కన్నడతోపాటు, ఇంగ్లీష్‌ బాషలోనూ రూపొందించారు. అంతర్జాతీయంగా ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు. మిడిల్‌ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ని టార్గెట్‌ చేసుకుని రూపొందిన ఈ మూవీని ఇప్పుడు రిలీజ్‌ చేస్తే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, ఈ అనుకోని సంఘటనల కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. 

35
టాక్సిక్‌ వర్సెస్‌ దురందర్‌ 2
Image Credit : instagram

టాక్సిక్‌ వర్సెస్‌ దురందర్‌ 2

యశ్ 'టాక్సిక్', రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్-2' మార్చి 19న ఒకే రోజు రిలీజ్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరుగుతుందని అందరూ భావించారు. 'ధురంధర్' మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసింది.

45
టాక్సిక్‌ కి భారీ హైప్‌.. దురందర్‌ 2 గట్టి పోటీ
Image Credit : Facebook

టాక్సిక్‌ కి భారీ హైప్‌.. దురందర్‌ 2 గట్టి పోటీ

ఇదిలా ఉండగా, 'టాక్సిక్' చిత్రబృందం మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రిలీజైన 'టాక్సిక్' టీజర్, పోస్టర్లు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 'తబాహి' పాట కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. మార్చి 3న హోలీ సందర్భంగా 'ధురంధర్-2' ట్రైలర్ వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, కానీ రాలేదు. ఆ వెంటనే 'టాక్సిక్' టీమ్ తమ ట్రైలర్ డేట్‌ను ప్రకటించింది. పాన్-ఇండియా స్థాయిలో బెంగళూరులోనే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది.

55
 దురందర్‌ 2కి తిరుగేలేదు
Image Credit : Facebook

దురందర్‌ 2కి తిరుగేలేదు

అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదలయితే బాక్సాఫీసు వద్ద పోరు గట్టిగా ఉంటుందని, రెండు సినిమాలకు కలెక్షన్ల దెబ్బ ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు ఆ పోటీ లేదు. `దురందర్‌ 2`కి లైన్‌ క్లీయర్‌ అయ్యింది. సింగిల్‌గానే ఈ మూవీ రాబోతుంది. ఇప్పటికే మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ మూవీకి తిరుగే లేదని చెప్పొచ్చు. బాక్సాఫీసు వద్ద ఊచకోతకి రణ్‌ వీర్ సింగ్‌ రెడీ అవుతున్నారని చెప్పొచ్చు. మరి ఏ స్థాయిలో సత్తా చాటుతుందో చూడాలి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nana Patekar Top 10 Movies: నానా పటేకర్‌ విశ్వరూపం చూపించే టాప్‌ 10 సినిమాలు.. అస్సలు మిస్‌ అవ్వద్దు
Recommended image2
Nana Patekar Passed away: విలక్షణ నటుడు నానా పటేకర్ కన్నుమూత, గోవాలో మరణం.. కారణం ఇదే
Recommended image3
The Paradise 14 Days Collection: దారుణంగా పడిపోయిన ప్యారడైజ్‌, నానికి లాస్ట్ ఛాన్స్.. ఇంకా ఎంత రావాలంటే?
Related Stories
Recommended image1
Sapthami Gowda: బాడీ పార్ట్స్ జూమ్‌ చేయడంపై `కాంతార` నటి ఫైర్‌.. ఎన్టీఆర్‌, నాగార్జున హీరోయిన్ల రియాక్షన్‌ ఇదే
Recommended image2
Chiranjeevi తండ్రి నటించిన మూవీస్‌ ఏంటో తెలుసా? మెగాస్టార్‌కి ముందే సినిమా ఎంట్రీ.. అల్లు రామలింగయ్య వల్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved