దివంగత ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరుకి 'ఎన్టీఆర్' చిత్రయూనిట్ చేరుకుంది. బాలయ్యతో పాటు కళ్యాణ్ రామ్, విద్యాబాలన్ నిమ్మకూరు చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎన్టీఆర్, బసవతారకం దంపతుల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు బాలయ్య.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాన్నగారి జీవిత చరిత్ర రెండు భాగాలుగా చిత్రీకరించామని అందులో మొదటి భాగం 'కథానాయకుడు' విడుదలకు సిద్ధంగా ఉందని అన్నారు. నిమ్మకూరులో ఆడియో ఫంక్షన్ అనుకున్నాం కానీ తుఫాను హెచ్చరికలు రావడంతో హైదరాబాద్ లో నిర్వహించినట్లు స్పష్టం చేశారు. 

సినిమా విడుదలకు ముందు నిమ్మకూరులో అభిమానులను పలకరించాలని వచ్చినట్లు చెప్పిన బాలయ్య 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా అంటే ఒక వర్గానికి, ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాదని అన్నారు. ఎన్టీఆర్ కొడుకుగా ఆయన పాత్ర చేయడం ప్రపంచంలోనే రికార్డ్ అని తెలిపారు. 'ఎన్టీఆర్' మహానాయకుడు మరో పదిరోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందని అన్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకోవడం దర్శకుడు క్రిష్ వలనే సాధ్యమైందని చెబుతూ అమ్మగారి పాత్రలో విద్యాబాలన్ అధ్బుతంగా నటించారని కొనియాడారు.

ఈ పాత్ర కోసం ఆమె ఎంతో రీసెర్చ్ చేసి మొదటి రోజు నుండే అమ్మ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. నాన్న గారు చేసిన పాత్రలు తనకు కూడా చేయాలని ఉండేదని.. వాటిలో కొన్ని పాత్రలు ఈ సినిమాలో కనిపిస్తాయని అన్నారు.  తండ్రి పాత్రని ఆవిష్కరించే అరుదైన అవకాశం రావడం అద్రుష్టంగా భావిస్తున్నట్లు.. భావితరాలకు ఎన్టీఆర్ చరిత్ర మిగిలిపోవాలనే ఈ సినిమా చేసినట్లు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు.. 

100 థియేటర్లలో 100 'ఎన్టీఆర్' విగ్రహాలు!

ఎన్టీఆర్ 'బయోపిక్' తొలి షోకి బాలయ్య ముహూర్తం!

‘ఎన్టీఆర్’కు ఆ ఇబ్బంది? బయ్యర్లు డౌట్, ఆన్సర్ ఇదే!

'ఎన్టీఆర్' బయోపిక్: ఆ రెండూ ఎంతో స్పెషల్

నాగార్జున కంటే సుమంత్ బెటర్: బాలకృష్ణ

అనుకోకుండా ఆ మాట చెప్పా: బాలకృష్ణ

బయోపిక్ కు 'తేజ' బై ఎందుకు చెప్పాలంటే.. :బాలకృష్ణ

వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై బాలయ్య కామెంట్!

ఎన్టీఆర్ సెన్సార్ టాక్: నో కట్స్.. ఇట్స్ పర్ఫెక్ట్!

మీకేమో అవి.. నాకైతే చంద్రబాబు పాత్రా..? రానా కామెంట్స్!

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?