Asianet News TeluguAsianet News Telugu

రవి పిచ్చోడు: శ్రీముఖి - శ్రీముఖిని దూరం చేయొద్దు: రవి

  • తెలుగు బుల్లితెరపై యాంకర్స్ గా మాంచి గుర్తింపు పొందిన శ్రీముఖి,రవి
  • ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న రవి, శ్రీముఖి
  • లాస్య తరహాలో శ్రీముఖిని తన నుంచి దూరం చేయొద్దన్న రవి
anchor sreemukhi ravi interview with ali tho saradaga goes viral

మైండ్ బ్లోయింగ్ యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల్లో తమకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యాంకర్లు శ్రీముఖి,రవి. పపటాస్ షోతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన ఈ యాంకర్ జోడీ రియల్ లైఫ్ లోనూ అంతే క్లోజ్ గా వుంటారు. అయితే అది కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమేనని వాళ్లు ఎప్పటికప్పుడు చెప్తూనే వుంటారు. అయినా వాళ్ల షోలు చూస్తే.. ఇంతకీ వీళ్ల మధ్య ఏం లేదంటే నమ్మటం ఎలా అనేలా షో చేస్తుంటారు. మరి వీళ్లిద్దరి మధ్యా ఏమీ లేదా... అదే తెలుసుకునే ప్రయత్నం చేశారు కమెడియన్ ఆలీ. ఆలీతో సరదాగా షోలో వీళ్లిద్దరిని పిలిచి అన్నీ అడిగేశాడు. ఆలీకే జాలీ అన్న రేంజ్ లో సాగింది షో.

 

టీవీ యాంకరింగ్ లో శ్రీముఖి, రవిలది ఇప్పుడో రేంజ్. తొలుత లాస్యతో యాంకరింగ్ చేసిన రవి.. ఆమె పెళ్లి చేసుకున్న టైం లో శ్రీముఖితో కలిసి ప్రోగ్రామ్స్, ఆడియో ఫంక్షన్ చేస్తూ సూపర్ హిట్ యాంకర్ పెయిర్ గా షోలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన ఆలీ షోలో వాళ్లు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ చాలా క్లోజ్ గా కనిపించిన ఈ షోలో ఆలీ అడిగిన ప్రశ్నలకి చాలా తుంటరి సమాధానాలు చెప్పారు.

anchor sreemukhi ravi interview with ali tho saradaga goes viral

 

ఒక్క మాటలో రవి గురించి ఏం చెప్తారు అంటే " పిచ్చోడు " అంటూ శ్రీముఖి బాంబు పేల్చింది. రవిని గొరిల్లా అనే జంతువు తో పోలుస్తా అని చెప్పిన ఆమె మనిషి గొరిల్లా, కోతి నుంచి వచ్చాడు అనీ అందుకే రవి కూడా అలాగే కోతి వేషాలు వేస్తాడు అని సరదాగా అంది. ఇక రవి డ్యాన్స్ చేస్తున్నప్పుడు దూరం నుంచి చూస్తుంటే తనకు కోతే కనిపిస్తుందని చెప్పుకొచ్చింది శ్రీముఖి.

 

ఇద్దరి మధ్యనా ఏదో ఉంది అంటూ సోషల్ మీడియా లో వచ్చే గుసగుసలకి ఏం సమాధానం చెప్తారని అడగ్గా.. మేము అసలు అలాంటివి కేర్ చెయ్యం. ఏదైనా ఉంటె ఖచ్చితంగా చెప్తాం కదా అని శ్రీముఖి అనగా.. మరొక పక్క రవి మాత్రం ఒకప్పుడు లాస్యకీ తనకీ ఇలాగే అక్రమ సంబంధం అంట గట్టారు, దాంతో మంచి ఫ్రెండ్ ని కోల్పోయాననీ, మళ్ళీ ఈ శ్రీముఖిని కూడా దూరం చెయ్యద్దనీ అన్నాడు రవి. క్లోజ్ గా వుండే ఫ్రెండ్స్ మధ్య ఏదేదో అంటగట్టడం ఫ్యాషన్ అయుపోయిందంటూ కాసింత ఆగ్రహం వ్యక్తం చేశాడు రవి.

Follow Us:
Download App:
  • android
  • ios