హాట్ ఇమేజ్ తో కెరీర్ నాశనం చేసుకుంటుందా..?

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 30, Aug 2018, 5:09 PM IST
anchor rashmi after anthakuminchi movie
Highlights

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన రష్మి 'జబర్దస్త్' మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటిగా కూడా బిజీ అయింది. 

బుల్లితెరపై యాంకర్ గా రాణించిన రష్మి 'జబర్దస్త్' మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తరువాత సినిమాల్లో అవకాశాలు రావడంతో నటిగా కూడా బిజీ అయింది. అయితే బుల్లితెరపై వచ్చినంత క్రేజ్ సినిమాల ద్వారా తెచ్చుకోలేకపోతుంది రష్మీ. కొన్ని సినిమాలు కేవలం డబ్బు కోసమే చూస్తుంటానని రష్మీ ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ 'గుంటూరు టాకీస్' తప్ప నటిగా ఆమెకు ఏ సినిమా కూడా సరైన సక్సెస్ ను అందించలేకపోయింది.

అయితే 'గుంటూరు టాకీస్' తరువాత ఆమెకు హీరోయిన్ గా చాలా సినిమాలు ఆఫర్లు వచ్చాయి. కానీ అందులో సరైన కథలను ఎన్నుకోవడంలో ఆమె పూర్తిగా విఫలమైంది. ఒక్క సినిమా కూడా కంటెంట్ కి ప్రాధ్యానత ఇచ్చింది లేదు. అన్నీ కూడా ఆమెకు హాట్ ఇమేజ్ ను తీసుకొచ్చే కథలే. దీంతో నటిగా నిరూపించుకునే అవకాశం లేకుండా పోయింది. రీసెంట్ గా 'అంతకుమించి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అసలు ఈ సినిమాను జనాలు కనీసం పట్టుకోలేదు కూడా.. తన గ్లామర్ షోతో ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. రష్మితో పాటే క్రేజ్ తెచ్చుకున్న అనసూయ మాత్రం కథల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. కానీ రష్మి మాత్రం ప్రేక్షకులను పరీక్ష పెట్టే సినిమాలు చేస్తూ తన కెరీర్ ని తనే నాశనం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇవి కూడా చదవండి.. 

కాస్టింగ్ కౌచ్ లో తప్పులేదు.. నేను దాన్ని గౌరవిస్తాను: రష్మి సంచలన కామెంట్స్!

సెక్స్ సింబల్ అనే ముద్ర పడిపోయింది.. రష్మి!

loader