కాస్టింగ్ కౌచ్ లో తప్పులేదు.. నేను దాన్ని గౌరవిస్తాను: రష్మి సంచలన కామెంట్స్!

First Published 27, Aug 2018, 11:29 AM IST
rashmi gautam comments on casting couch
Highlights

సినిమా ఇండస్ట్రీలో కొద్దిరోజుల వరకు కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్నే రేపింది. శ్రీరెడ్డి ఇండస్ట్రీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేయడం పలు వివాదాలకు దారి తీసింది. ఇప్పుడు ఆమె కోలీవుడ్ తారలపై కూడా ఆరోపణలు చేస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో కొద్దిరోజుల వరకు కాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారాన్నే రేపింది. శ్రీరెడ్డి ఇండస్ట్రీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేయడం పలు వివాదాలకు దారి తీసింది. ఇప్పుడు ఆమె కోలీవుడ్ తారలపై కూడా ఆరోపణలు చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు స్పందించారు. కొందరు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటే.. మరికొందరు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని అన్నారు.

యాంకర్ రష్మి మాత్రం కాస్టింగ్ కౌచ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు కాస్టింగ్ కౌచ్ లో తప్పేముంది అంటూ ఆమె చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ''నేను సినిమాల్లో నటిస్తున్నాను. ఏ నిర్మాత కూడా నాతో తప్పుగా ప్రవర్తించలేదు. ఈ విషయంలో నేను నిజాయితీగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గా వర్క్ చేసిన 'అంతకుమించి' నిర్మాత కూడా నాతో మిస్ బిహేవ్ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద విషయాలు జరిగాయి. అవన్నీ నాకు కూడా తెలుసు.

శ్రీరెడ్డి పరిస్థితి కావొచ్చు.. మరొకటి కావొచ్చు.. ఏదేమైనా.. ఎవరూ మనల్ని మానభంగం చేయలేరు, బలవంతం చేయలేరు. ప్రతీ విషయంలో నో చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా.. నా దృష్టిలో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక చాయిస్. నేను దాన్ని గౌరవిస్తాను కూడా. కెరీర్ బాగుందనిపిస్తే.. కాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పడంలో తప్పు లేదు. ఇద్దరి అంగీకారంతో జరిగేది అది. ఇది ఎవరికివారి పర్సనల్ విషయం. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. ప్రతీ చోట కాస్టింగ్ కౌచ్ ఉంది. దీన్ని ఇంత పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు'' అంటూ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి.. 

సెక్స్ సింబల్ అనే ముద్ర పడిపోయింది.. రష్మి!

రష్మి చెప్పేవరకు నాకు ఆ విషయం తెలియదు.. 'అంతకుమించి' హీరో!

loader