సెక్స్ సింబల్ అనే ముద్ర పడిపోయింది.. రష్మి!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 26, Aug 2018, 12:30 PM IST
rashmigautam about her image
Highlights

బుల్లితెరపై యాంకర్ గా తన ప్రతిభ చాటిన రష్మి వెండితెరపై కూడా నటిగా రాణిస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన 'అంతకుమించి' సినిమా విడుదలైంది

బుల్లితెరపై యాంకర్ గా తన ప్రతిభ చాటిన రష్మి వెండితెరపై కూడా నటిగా రాణిస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన 'అంతకుమించి' సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటుంది. అయితే సెక్స్ సింబల్ అనే ముద్ర మీపై పడినట్లుందని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. 'అవును నాపై ఆ ముద్ర పడిపోయింది. కానీ అది నేను కావాలని చేయలేదు.

నటిగా కొన్ని ప్రయోగాలు చేయాలనుకుంటాను.. మొదట్లో 'కరెంట్','ప్రస్థానం' వంటి సినిమాలు చేశాను. అందులో సైడ్ క్యారెక్టర్ రోల్స్. ఆ తరువాత కూడా అలాంటి పాత్రలే రావడం మొదలయ్యాయి. అంటే అక్కడితో నా గ్రోత్ ఆగిపోయింది. ఎవరైనా లీడ్ రోల్స్ లో నటించాలనే అనుకుంటారు. కానీ నాకు ఇండస్ట్రీలో ఎవరూ తెలియక వచ్చిన పాత్రలన్నీ చేసుకుంటూ వెళ్లాను.

అదే సమయంలో 'గుంటూరు టాకీస్' సినిమా ఆఫర్ వచ్చింది. కొత్తగా ఉండాలి ట్రై చేశాను. ఆ పాత్ర బాగా క్లిక్ అయింది. ఇప్పుడు అందరికీ గ్లామర్ అనేది త్వరగా ఎక్కుతుంది. ఆర్టిస్ట్ గా నేను ప్రయత్నించిన సినిమాల కంటే ఇలా గ్లామర్ రోల్స్ చేసినప్పుడు బాగా క్లిక్ అయ్యాను. ఇప్పుడు ఆ ముద్ర నుండి బయటకి రావాలనే ప్రయత్నాలు చేయడం లేదు. నా మీద నమ్మకంతో సినిమాలు చేసే నిర్మాతలకు డబ్బులు రావాలి. వాళ్లు సేఫ్ గా ఉండాలి. దానికి కోసం నా సహకారం అందిస్తాను'' అంటూ చెప్పుకొచ్చింది.

loader