సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్‌, బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం 2.0. తనదైన శైలిలో  సోషల్ ఎలిమెంట్స్ కి గ్రాఫిక్  జోడించి ఈ చిత్రాన్ని ఓ విజువ‌ల్ వండ‌ర్‌లా తెర‌కెక్కించాడు శంక‌ర్ . 2.0 చిత్రం మార్నింగ్ షో  నుంచే మంచి టాక్ తెచ్చుకుని రికార్డులు సృష్టిస్తుంది. ముఖ్యంగా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో రజ‌నీకాంత్ గ‌త సినిమాల క‌న్నా ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించి సరికొత్త రికార్డ్  క్రియేట్ చేసింది. ఇదంతా నిర్మాతలకు, డిస్ట్ర్రిబ్యూటర్స్ కు ఆనందం కలిగించే విషయమే. అయితే అమీ జాక్సన్ కు  మాత్రం ఈ సినిమా బాధనే మిగిల్చింది. తనకు ఈ చిత్రం ద్వారా మోసపోయినట్లు ఫీలవుతోందని తమిళ మీడియా వర్గాల సమచారం.

భారీ బ‌డ్జెట్ చిత్రంగా రూపొందిన 2.0 చిత్రం కోసం ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్ ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో సినిమా చూసిన ప్రతీ ఒక్కరికి అర్దమవుతుంది. ముఖ్యంగా హీరోయిన్ గా న‌టించిన అమీజాక్స‌న్ అయితే చిత్రం ప్రారంభం కాక ముందు నుండే యాక్షన్ కొరియోగ్రాఫ‌ర్స్ స‌మ‌క్షంలో స్లో మోష‌న్‌లో స్టంట్స్  ప్రాక్టీస్ చేసింది.  తొలి స్టంట్ అంటూ అమీ తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రతి స్టంట్‌ని స్లో మోష‌న్‌లో చేశాం. అప్పుడే చేసిన త‌ప్పులు తెలుస్తాయి. షూట్ స‌మ‌యానికి వాటిని స‌రిదిద్దుకోవ‌చ్చు అని అమీ త‌న వీడియోకి కామెంట్‌గా తెలిపింది. అలా షేర్ చేసిన అమీ జాక్స‌న్ వీడియోకి మంచి రెస్పాన్స్   వచ్చింది. 

అయితే సినిమా కోసం అంతలా కష్టపడితే తెరమీద అంత సీన్ లేదు. ఆమె పాత్ర ఓ రోబోగా మిగిలిపోయింది. హీరోయిన్ గా ఆమె చేసిందేమీ లేదు. ఓ మరబొమ్మగా కనపడి ఎవరినీ ఎట్రాక్ట్ చేయలేకపోయింది. దాంతో రజనీ వంటి సూపర్ స్టార్ ప్రక్కన చేసినా, శంకర్ వంటి స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో సినిమా చేసినా ఫలితం లేకపోయింది. అమీ గురించి మాట్లాడేవాళ్లే లేరు. దాంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కు అమీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తాను మోసపోయానని తన వారిదగ్గర వాపోతోందిట. 

లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ‘2.0’ సినిమాను నిర్మించింది. ఎ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందించారు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. 

ఇవి కూడా చదవండి.. 

'2.0' సెకండ్ డే కలెక్షన్స్.. జస్ట్ ఏవరేజ్!

సగం ధరకే '2.0' టికెట్లు!

'2.0' రివ్యూలపై మేధావులు అంటూ 'దిల్ రాజు' వెటకారం

'2.0' ఫస్ట్ డే కలెక్షన్స్!

'2.0' లో అక్షయ్ కుమార్ పాత్రకు ఇన్స్పిరేషన్ ఇతడే!

బాక్సాఫీస్ కి దిగిపోద్ది.. '2.0' పై నాని కామెంట్!

శంకర్ - రాజమౌళి.. మొదలైన ఫ్యాన్స్ వార్!

శంకర్ ఇచ్చిన పక్షి సందేశం.. ప్రపంచానికి ఒక వార్నింగ్!

'2.0' పైరసీ.. 12 వేల వెబ్ సైట్లు బ్లాక్!

మీడియాలో '2.0' మూవీ రివ్యూ..!

శంకర్ '2.0'పై సెలబ్రిటీల ట్వీట్స్!

'2.0' మూవీ ట్విట్టర్ రివ్యూ..!

2.0 ప్రీమియర్ షో రివ్యూ

'2.0' పై రాజమౌళి ట్వీట్!

'2.0'పై వారికి నమ్మకం లేదా..?

'2.0' మేకర్స్ అలా చేసి రిస్క్ చేస్తున్నారా..?

'2.0' లో శంకర్ ఏం దాచాడో..?

'2.0' సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది!

2.0 క్రేజ్ లో టాలీవుడ్ సినిమాల ప్రమోషన్స్!

2.0 బాక్స్ ఆఫీస్: అడ్వాన్స్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?