Asianet News TeluguAsianet News Telugu

బోటు ప్రమాద కుటుంబాలకు క్షమాపణలు చెప్పండి: హర్షకుమార్ పై మాజీ ఎంపీ పండుల ఫైర్

రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడితే మంచిదని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారంటూ హర్షకుమార్ ఆరోపించిడం సరికాదన్నారు. 

ysrcp leader, ex mp pandula ravindrababu fires on gv harsha kumar
Author
Amalapuram, First Published Sep 21, 2019, 2:32 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కాకినాడ: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పై నిప్పులు చెరిగారు మాజీ ఎంపీ, వైసీపీ నేత పండుల రవీంద్రబాబు. దేవీపట్నం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంపై హర్షకుమార్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు.  

బోటు ప్రమాదాన్ని రాజకీయ నిరుద్యోగులు తమ ప్రచారానికి వాడుకోవడం విచారకరమన్నారు. బోటు ప్రమాదం జరగడం దురదృష్టకరమని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

రెండుసార్లు ఎంపీ అయిన హర్షకుమార్ బాధ్యతాయుతంగా మాట్లాడితే మంచిదని సూచించారు. చనిపోయిన వారు అసాంఘిక కార్యక్రమాలు చేసేందుకే లాంచీలో వెళ్లారంటూ హర్షకుమార్ ఆరోపించిడం సరికాదన్నారు. 

హర్షకుమార్ వ్యాఖ్యలతో మృతుల కుటుంబాలు మనోవేదనకు గురవుతాయని చెప్పుకొచ్చారు. హర్షకుమార్ అంటే ఇప్పటికీ తమకు ఎంతో గౌరవం ఉందన్నారు. మీ మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పుకొచ్చారు. మృతుల కుటుంబాలకు హర్షకుమార్ క్షమాపణ చెప్పాలని పండుల రవీంద్రబాబు డిమాండ్ చేశారు. 

బోటు ప్రమాదం ఘటనను సంచలనాలకు, రాజకీయాలకు వాడకూడదని హితవు పలికారు. బోటు ప్రమాదంపై ప్రభుత్వం చేయాల్సిదంతా చేస్తోందని పండుల రవీంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ ఉద్యోగం కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకుని హర్షకుమార్‌ నైతిక విలువలు దిగజార్చుకున్నారని దుయ్యబట్టారు. 

మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావుపైన పండుల రవీంద్ర మండిపడ్డారు. దళితులపై దాడి చేసిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేశారు. మీకు కళ్లు పోయాయా అని నిలదీశారు. 

దళితులను చింతమనేని దుర్భాషలాడినప్పుడు మీరు ఏమైపోయారని నిలదీశారు. బుద్ధుడి పేరుతో భూములు ఆక్రమించే గొల్లపల్లి సూర్యారావుకు సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని తిట్టిపోశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉప ముఖ్యమంత్రి‌ పదవులు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదని అలాంటి వ్యక్తిని విమర్శిస్తే సహించేది లేదన్నారు. 

ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు మునక: వెంకట శివ సంచలన ఆరోపణలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios