Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం- కచ్చలూరు గ్రామాల మధ్య ఆదివారం నాడు బోటు మునిగిన ఘటనలో  సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

cm jagan orders to rescue operations at devipatnam in east godavari district
Author
East Godavari, First Published Sep 15, 2019, 3:02 PM IST | Last Updated Sep 15, 2019, 3:02 PM IST


రాజమండ్రి:దేవీపట్నం-కచ్చలూరు మధ్య పున్నమి బోటు మునిగిన ఘటనపై  సీఎం జగన్ ఆరా తీశారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఘటన జరిగిన ప్రాంతానికి మంత్రులు, అధికారులు హుటాహుటిన బయలుదేరారు.

ఆదివారం నాడు పాపికొండలు చూసేందుకు 61 మంది పర్యాటకులతో వెళ్తున్న బోటు కచ్చలూరు సమీపంలో  మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం అధికారులను ఆదేశించారు.

సంఘటన స్థలానికి వెళ్లాలని మంత్రులను, అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మరో వైపు రాజమండ్రి నుండి హెలికాప్టర్లు సహాయక చర్యల కోసం బయలుదేరి వెళ్లాయి. మరో వైపు రెండు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దించింది ప్రభుత్వం. ప్రమాదం జరిగిన ప్రాంతానికి మరికొన్ని బోట్లను ప్రభుత్వం పంపింది.

మరో వైపు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ తో  సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం పోన్ లో మాట్లాడారు. సంఘటన గురించి తెలుసుకొన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
 

సంబంధిత వార్తలు

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios