డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం -కచలూరు వద్ద ప్రమాదం క్షణంలోనే చోటు చేసుకొందని బాదితులు చెప్పారు.
దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం- కచలూరు సమీపంలో ఆదివారం నాడు బోటు తిరగబడింది. ఈ ఘటనలో 39 మంది గల్లంతయ్యారు.ఈ ఘటనలో 47 మంది మృత్యువాత పడినట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దేవీపట్నం-కచలూరు మధ్యకు బోటు రాగనే ఈ ప్రాంతం డేంజర్ జోన్ అని బోటు సిబ్బంది హెచ్చరించారు. డేంజర్ జోన్ కు సమీపంలోకి బోటు బోటు రావడానికి కొద్ది క్షణాల ముందే పెద్ద అల బోటును తాకింది. ఆ సమయంలో బోటు కొంచెం ఒరిగిందని బోటు ప్రమాదం నుండి సురక్షితంగా బయటకు పడిన వారు చెప్పారు.
అదే సమయంలో ఈ ప్రాంతం డేంజర్ జోన్ అని చెప్పారు. డేంజర్ జోన్ అని ప్రకటించిన క్షణంలోనే బోటు కుదుపుకు గురైంది. బోటు కుదుపు కారణంగా బోటులో ఎడమ వైపుకు కూర్చున్న వారంతా కుడివైపుకు ఒరిగారు.
దీంతో బోటులో ఉన్నవారంతా ఒక్కరిపై ఒక్కరు పడిపోయారు. ఈ సమయంలో లైఫ్ జాకెట్ వేసుకొన్నవాళ్లు మాత్రమే నీళ్లలో తేలియాడారు. ఈ విషయాన్ని పక్కనే ఉన్న తూటుగుంట గ్రామస్తులు గుర్తించారు. రెండు బోట్లలో వారంతా సంఘటన స్థలానికి చేరుకొని లైఫ్ జాకెట్లు వేసుకొని ఉన్నవారిని గ్రామస్తులు బోట్లలో ఒడ్డుకు తీసుకెళ్లారు.
సంబంధిత వార్తలు
పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్
పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం
పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం
బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం
గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..
అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్
బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి
బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు
బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం
బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం