Asianet News TeluguAsianet News Telugu

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున, ఘటననుంచి బయటపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిహారం తక్షణమే బాధితులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

ap cm ys jaganmohan reddy reviw on boat accident, serious on officials
Author
Rajamahendravaram, First Published Sep 16, 2019, 9:40 PM IST

రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వద్ద చోటు చేసుకున్న బోటు ప్రమాదంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల మధ్య సమన్వయ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందంటూ మండిపడ్డారు. 

టూరిజం శాఖ, ఇరిగేషన్ శాఖ, పోలీస్ శాఖ సంయుక్తంగా ఏర్పాటు చేయాల్సిన కంట్రోల్ రూం ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని జగన్ ప్రశ్నించారు. అధికారులు సమాధానం చెప్పకపోవడంతో మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. 

బోటు ప్రమాదం, చేపట్టిన చర్యలపై రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సహాయక కార్యక్రమాలను శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు. 

గోదావరిలో తిరుగుతున్న బోట్లు, లైసెన్సింగ్‌ విధానం, తనిఖీలు చేస్తున్న విధానం, ఇందులో శాఖలవారీగా బాధ్యతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
గోదావరిలో ఎన్ని ప్రభుత్వ బోట్లను నడుపుతున్నారని ప్రశ్నించారు. 

ప్రభుత్వం ఐదు బోట్లను నిర్వహిస్తోందని అయితే వరద కారణంగా నడపడం లేదని అధికారులు సీఎం వైయస్ జగన్ కు తెలియజేశారు. ప్రభుత్వ బోట్లు నిలిపివేసినప్పుడు ప్రైవేటు బోట్లు ఎందుకు నడిపారని నిలదీశారు. 

ఇదే అంశాన్ని క్షతగాత్రులు తనను అడిగారని తాను ఏం చెప్పాలో తెలియలేదన్నారు. దీనికి అధికారులు ఏం సమాధానం చెప్తారని గట్టిగా ప్రశ్నించారు సీఎం జగన్. గత ఏడాది జారీచేసిన జీవో ప్రకారం కంట్రోల్‌ రూమ్స్‌ ఎందుకు పెట్టలేదని అధికారులను నిలదీశారు.  

బోటుకు కేవలం రిజిస్ట్రేషన్‌ ఇచ్చే అధికారం ఉంది కానీ, ఏ రూట్లో నడపాలో అనుమతి ఇచ్చే అధికారం తమకు లేదని చెప్పిన పోర్టు అధికారులు 
ప్రైవేటు బోట్లను అడ్డుకునే అధికారం టూరిజం అధికారులకు లేనప్పుడు నీటిపారుదల శాఖకు ఆపే అధికారం ఉంది కదా? అని ప్రశ్నించారు. 

కంట్రోల్‌రూమ్స్‌ ఉండాలంటూ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను ఎందుకు పాటించలేదని నిలదీశారు. 
ముఖ్యమైన పాయింట్ల వద్ద కంట్రోల్‌రూమ్స్‌ పెట్టాల్సి ఉండగా ఎందుకు పెట్టలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసలు నియంత్రణా వ్యవస్థే కనిపించడం లేదని మండిపడ్డారు. కేవలం నామ మాత్రంగానే శాఖల అధికారులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ జీవోలకే పరిమితం చేస్తారా అంటూ మండిపడ్డారు. 

పోలీసులపై సీఎం జగన్ ఆగ్రహం

ప్రభుత్వ బోట్లు ఓవైపు ఆగి ఉన్నాయని తెలిసినా కూడా ప్రైవేటు బోట్లను పోలీసులు ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎందుకు అడ్డుకోలేదని ఆగ్రహించారు. బోటు దగ్గరకు పోలీసులు వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీశారు, మద్యం ఏమైనా ఉందా? అని తనిఖీలు చేశారు కానీ అడ్డుకోలేదా అంటూ మండిపడ్డారు. 

పోలీసు అధికారులు, నీటిపారుదల అధికారులు, టూరిజం అధికారులతో కూడిన కంట్రోల్‌ వ్యవస్ధ పెట్టాల్సి ఉండగా పెట్టలేదన్నారు. అసలు శాఖల మధ్యే సమన్వయంలేదన్న విషయం స్పష్టమౌతుందన్నారు. ఎవరు ఏంచేస్తున్నారన్నదానిపై ఎవ్వరికీ పట్టింపులేకుండా పోయిందని మండిపడ్డారు. 

ప్రమాదానికి అసలు కారణం ఇక్కడే ఉంది, మొత్తం వ్యవస్థను మార్చాలంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. బోట్లకు లైసెన్స్‌ ఇచ్చే మెకానిజం ఏంటన్నది పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. 

తక్షణమే కంట్రోలు రూమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసులు, ఇరిగేషన్, టూరిజం, పోర్టు విభాగాలు సమన్వయంతో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఏ నదిపైనైనా  బోట్లు తిరిగితే తప్పకుండా ఈ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాల్సిందేనని హెచ్చరించారు. 


కంట్రోల్‌ రూం లేకుండా బోట్లు తిరిగే పరిస్థితి ఉండకూడదని స్ట్రిక్ట్ గా చెప్పారు. లైసెన్స్‌ ఇవ్వగానే బాధ్యత తీరదని క్రమం తప్పకుండా తనిఖీలు కూడా చేయాలని అధికారులను ఆదేశించారు. 

అత్యుత్తమ విధానం ఏంటో చూసి నెలరోజులకు ఒకసారి తనిఖీలు చేయాలన్నారు. టూరిజం శాఖకు సంబంధించినంత వరకూ తూర్పు, పశ్చిమగోదావరిలో 68 రాష్ట్రవ్యాప్తంగా 81 బోట్లు ఉన్నాయి. వాటన్నింటికీ లైసెన్స్‌ ఇచ్చే ప్రక్రియను, తనిఖీలు చేసే తీరును మార్చాలని మండిపడ్డారు. 

 ప్రస్తుతం 15 రోజులపాటు బోట్లన్నీ నిలిపేయాలని క్షుణ్నంగా తనిఖీచేసిన తర్వాతే వదలాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. 

ముఖ స్తుతి కోసం మాట్లాడి తూతూమంత్రంగా సమీక్షలు చేయడం వల్ల ఉపయోగం ఉండదన్నారు. ఇక్కడినుంచే లోపాలను సరిదిద్దే పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు.
ప్రతిబోటులో జీపీఎస్, వైర్‌లెస్‌ సెట్లు కచ్చితంగా ఉండాలని ఆదేశించారు. 

ఎన్ని లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంటే బోట్లను అనుమతించవచ్చని అధికారులను ప్రశ్నించారు. కంట్రోల్‌ రూమ్స్‌ మొదలుపెట్టేటప్పుడు దీనిపై మార్గదర్శకాలు తయారుచేయాలని ఆదేశించారు. అన్ని బోట్లకూ ఒకటే నియమం వర్తించాలని సూచించారు. 

ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ చేయలేమన్న సందేహం ఉన్నప్పుడు పూర్తిగా వాటిని రద్దుచేసి కేవలం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపొచ్చుకదా? అంటూ అధికారులను ప్రశ్నించారు. ఇంతమంది ప్రాణాలు పోయాయి అంటే దానికి కారణం ఎవరని నిలదీశారు. 

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం జరిగింది కదా అంటూ నిలదీశారు. ఆస్పత్రిలో బాధితులను చూసినప్పుడు గుండె చెరువయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. బాధితుల్లో చాలామంది కుటుంబాలకు కుటుంబాలనే కోల్పోయారని చెప్పుకొచ్చారు. 

ఆస్పత్రిలో బాధితులను చూసినప్పుడు చాలా బాధవేసిందన్నారు. మనం అంతా ఏంచేస్తున్నామనిపిస్తోందన్నారు. అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే బోటును ఆపగలిగే అవకాశం ఉన్నా.. ఆపలేకపోయామన్నారు. ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలన్నారు సీఎం. 

చనిపోయినవారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.3 లక్షల చొప్పున, ఘటననుంచి బయటపడ్డ వారికి రూ.1 లక్ష చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పరిహారం తక్షణమే బాధితులకు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 
 
జరిగిన ఘటనలో మన బాధ్యత ఉంది కాబట్టి ఈ పరిహారం అందిస్తున్నట్లు జగన్ స్పష్టం చేశారు. మనం తప్పుచేశాం కాబట్టే ఈ పరిహారాన్ని ఇవ్వాల్సి వచ్చిందన్న విషయాన్ని అధికారులు అంతా గుర్తించాలని హెచ్చరించారు. 

తప్పులేదని వేరొకరిమీద నెట్టేసి, ప్రభుత్వానికి బాధ్యతలేదన్నట్టుగా ఉండడం ఒకటైతే, జరిగిన తప్పుకు బాధ్యత వహించి వారికి పరిహారం చెల్లించడం రెండో పద్దతి ఇలానే వ్యవహరించేది అని నిలదీశారు. మొదటి పద్ధతికి తన మనస్సు ఒప్పుకోవడంలేదన్నారు. 

అందుకనే జరిగిన తప్పుకు బాధ్యత వహించి ఆయా కుటుంబాలకు మంచిచేయాలని అందరికీ పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. బాధ్యత స్వీకరించి మరణించిన కుటుంబాలకే కాదు అందరికీ పరిహారం చెల్లిస్తున్నామన్నారు 

కానీ ఇకపై ఇలాంటి తప్పులు జరగకుండా చూడాలని గట్టిగా హెచ్చరించారు. బోటు ప్రమాద ఘటనపైన, ఇలాంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని వేస్తున్నట్లు ప్రకటించారు. ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారని తెలిపారు. 

స్పెషల్‌చీఫ్‌ సెక్రటరీ రెవిన్యూ, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, అడిషన్‌ డీజీ లా అండ్‌ ఆర్డర్, పోర్టు డైరెక్టర్‌ సభ్యులుగా కమిటీలో ఉంటారని తెలిపారు. తూర్పుగోదారి జిల్లా కలెక్టర్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 

కేవలం జీవోలు ఇచ్చి ఊరుకోవడంకాదన్నారు. వాటిని అమలు జరిగేలా చూసే బాధ్యత కూడా కమిటీదేనన్నారు. కేవలం సూచనలతో సరిపెట్టుకోవడం కాదు వచ్చేసారి ఈ జిల్లాకు వచ్చేటప్పటికి  కంట్రోల్‌ రూం ఏర్పాటు కావాలని ఆదేశించారు. మూడు వారాల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలన్నారు. నాలుగోవారానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు కావాలి, అది అమలు కావాలంటూ సీఎం జగన్ ఆదేశించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios