Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక: ప్రమాదంలో వరంగల్ వాసులు

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం కచలూరు మధ్య ఆదివారం నాడు జరిగిన బోటు మునిగిన ప్రమాదంలో వరంగల్ వాసులు కూడ ఉన్నట్టుగా అధికారులు ప్రకటించారు. 

boat capsized: warangal people caught in boat accident
Author
Warangal, First Published Sep 15, 2019, 4:46 PM IST

హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం-కచలూరుసమీపంలో ఆదివారం నాడు బోటు మునిగిన ప్రమాదంలో  తెలంగాణకు చెందిన 22 మంది  కూడ ఉన్నట్టుగా సమాచారం.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో 16మందిని సురక్షితంగా రక్షించినట్టుగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ ప్రకటించారు. ఇప్పటికే ఐదు మృతదేహలను వెలికితీశారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 14 మందితో పాటు హైద్రాబాద్ కు చెందిన వారు కూడ ఈ బోటులో ఉన్నారని సమాచారం అందుతోంది.హైద్రాబాద్ కు చెందిన వారిలో 22 మంది, వరంగల్ జిల్లాకు చెందిన వారు 9, విశాఖపట్టణం, రాజోలుకు చెందిన వారు ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. 

ఉమ్మడి వరంగల్ జిల్లా కడిపికొండకు చెందిన 14 మంది పాపికొండల టూరుకు  ఈ నెల 13వ తేదీన వెళ్లారు. బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, బస్కే ప్రసాద్, బస్కే అవినాష్, దర్శనం సురేష్, సునీల్, బస్కే రాజేందర్, శివ్వి వెంకటయ్య, , ఆరేపల్లి యాదగిరి, సునీల్. గొర్రె రాజేందర్, ప్రభాకర్, కొండూరి రాజ్ కుమార్, కొమ్మల రవి, బస్కే ధర్మరాజులు పాపికొండల టూరుకు వెళ్లినట్టుగా సమాచారం అందింది.ఈ ప్రమాదంలో మురళితో పాటు మరో ఐదురుగు ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు. మరో 9 మంతి ఆచూకీ గల్లంతైంది. 


దేవీపట్నం లాంచీ ప్రమాదం నేపధ్యంలో విశాఖ జిల్లా పర్యాటకుల కోసం విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ ఏర్పాటు చేశారు. విశాఖ జిల్లా నుంచి పాపికొండల టూర్ కి ఎవరైనా వెళ్లి ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 180042500002 కు వివరాలు తెలపాలని కలెక్టర్ వినయ్ చంద్ కోరారు.

"

 

సంబంధిత వార్తలు

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios