Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక: వెంకట శివ సంచలన ఆరోపణలు

మాజీ ఎంపీ హర్షకుమార్  ఆరోపణలకు ఊతమిచ్చేలా వెంకట శివ కూడ  ఆరోపణలు చేశారు. 

venkatasiva sensational comments on boat accident
Author
Rajahmundry, First Published Sep 20, 2019, 6:30 PM IST

దేవీపట్నం: గోదావరిలో బోటు మునిగిన రెండో రోజునే గుర్తించినట్టుగా వెంకట శివ చెప్పారు. రన్నింగ్ పంట్, రోప్ ఇస్తే రెండు గంటల్లో బోటును బయటకు తీస్తానని ఆయన తేల్చి చెప్పారు.

ఈ నెల 15వ తేదీన  తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు మధ్యలో  గోదావరిలో బోటు మునిగిపోయింది.  మునిగిపోయిన బోటును  వెంకటశివ గుర్తించాడు. శుక్రవారం నాడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ బోటును బయటకు తీయడం  పర్యాటక అధికారులకు ఇష్టం లేదన్నారు.  అందుకే పర్యాటక శాఖాధికారులు, బోటు యజమానులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. 

బోటును గుర్తించడానికి ఉత్తరాఖండ్‌ నిపుణులు అవసరం లేదని కొట్టిపారేశారు. వాళ్లు తీసుకొచ్చిన కెమెరాలు సరిగా పనిచేయడం లేదని వెంకటశివ చెప్పారునదుల్లో మునిగిన బోట్లను తీయడంలో వెంకట శివకు  అపార అనుభవం ఉందని చెబుతారు.

ఈ బోటు ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ కూడ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రెండు రోజులుగా హర్షకుమార్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి ఫోన్ చేస్తే బోటు ముందుకు కదిలిందని హర్షకుమార్ గురువారం నాడు ఆరోపించారు. ఈ ఆరోపణలకు కొనసాగింపుగా శుక్రవారం నాడు కూడ  మరికొన్ని ఆరోపణలు చేశారు హర్షకుమార్. అధికారులు సీఎంను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరపించారు.

సంబంధిత వార్తలు

బోటు ప్రమాద నిందితుల అరెస్ట్: ముగ్గురిని మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు

మంత్రి అవంతి శ్రీనివాస్ తాగి మాట్లాడుతున్నారా..?: బోటు ప్రమాదంపై హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు

బోటు ప్రమాదంపై హర్షకుమార్ వ్యాఖ్యలు: ఖండించిన అవంతి, తూగో.జిల్లా ఎస్పీ

హర్షకుమార్ సంచలనం: మంత్రి అవంతి మెడకు చుట్టుకున్న బోటు ప్రమాదం ఉచ్చు

బోటు ప్రమాదం ఇలా జరిగింది: ప్రత్యక్ష సాక్షి మధులత

బోటు మునక: రెడ్ సిగ్నల్ చూపినా పట్టించుకోని డ్రైవర్

బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

Follow Us:
Download App:
  • android
  • ios