MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • Heat Wave Alert : ఈ నాల్రోజులు చుక్కలే... ఈ జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్, ఎల్లో అలర్ట్

Heat Wave Alert : ఈ నాల్రోజులు చుక్కలే... ఈ జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్స్, ఎల్లో అలర్ట్

Telangana Weather : తెలంగాణలో రాబోయే నాలుగురోజులు ఎండలు మండిపోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అయితే ఏకంగా 40 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్స్ నమోదుకానున్నాయని హెచ్చరించింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 03 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇవేం ఎండల్రా నాయనా..!
Image Credit : ChatGPT

ఇవేం ఎండల్రా నాయనా..!

Heat Wave Alert : మార్చ్ వచ్చేసింది... ఇక అసలుసిసలైన వేసవికాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే చలి పూర్తిగా తగ్గి ఎండలు మొదలయ్యాయి... ఇకపై మరింత ముదిరి తారాస్థాయికి చేరతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఇవాళ(సోమవారం) నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... రాబోయే నాలుగురోజులు ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇవాళ్టి నుండే ఎండలు షురూ...
Image Credit : Getty

ఇవాళ్టి నుండే ఎండలు షురూ...

మార్చ్ 2 నుండి ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూన్నాలుగు రోజులు అంటే మార్చ్ 6 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటించింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.

Related Articles

Related image1
Heat Stroke : తెలంగాణ రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ ... ఇకపై ఎండల్లో చనిపోయినా ఎక్స్ గ్రేషియా
Related image2
Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
35
ఈ జిల్లాల్లో ఎండలే ఎండలు
Image Credit : Getty

ఈ జిల్లాల్లో ఎండలే ఎండలు

ఇక మార్చి 4 (బుధవారం) నుండి భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, వనపర్తి జిల్లాల్లో... మార్చ్ 5 నుండి కామారెడ్డి, మెదక్, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఎండలు ముదురుతాయని... అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 6 వరకు ఈ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

45
ఈసారి మండిపోనున్న ఎండలు..
Image Credit : Freepik

ఈసారి మండిపోనున్న ఎండలు..

ఇదిలా ఉంటే మార్చిలో ఎండలు కేవలం శాంపిల్స్ మాత్రమేనని... ఏప్రిల్, మేలో అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడి భగభగలు తారాస్థాయికి చేరతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా ప్రతి వేసవిలో ఈ రెండునెలలు ఎండలు అధికంగా ఉంటాయి.. కానీ ఈసారి మాత్రం మరింత ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీగా ఎండల తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

55
హైదరాబాద్ లో హయ్యెస్ట్ టెంపరేచర్స్
Image Credit : freepik

హైదరాబాద్ లో హయ్యెస్ట్ టెంపరేచర్స్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగి నగరవాసులను వేడిగాలులు, ఉక్కపోత సతమతం చేస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు. మంగళవారం అత్యధికంగా 36 నుండి 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించారు. ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. కాబట్టి ఈ ఎండలనుండి ఉపశమనం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ,తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
Recommended image3
అమెరికాకు అందుకోసమే వెళ్లాలనుకున్నా.. కానీ అడ్డుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి
Related Stories
Recommended image1
Heat Stroke : తెలంగాణ రాష్ట్ర విపత్తుగా వడదెబ్బ ... ఇకపై ఎండల్లో చనిపోయినా ఎక్స్ గ్రేషియా
Recommended image2
Heat Wave Alert : అసలుసిసలైన ఎండలు షురూ.. ఈ జిల్లాల్లో ఏకంగా 40 డిగ్రీలు, ఎల్లో అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved