బోటు మునక: దొరకని ఆచూకీ, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద బోటు మునిగిన ప్రమాదంలో ఆచూకీ గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

Boat capsizes in Godavari river: No sightings as search on with choppers, over 100 rescuers

దేవీపట్నం: తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం-కచ్చలూరు వద్ద బోటు మునిగిన ప్రమాదంలో గల్లంతైన వారి జాడ ఇంకా దొరకలేదు. సోమవారం రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా కూడ ప్రయోజనం లేకపోయింది.మంగళవారం నాడు ఉదయం నుండి గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.

పాపికొండలుకు  బయలుదేరిన పర్యాటకుల బోటు దేవీపట్నం-కచ్చలూరు వద్ద మునిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యాయి. 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇంకా 38 మంది ఆచూకీ దొరకలేదు.

పడవలో ఎంతమంది పర్యటించారనే సమాచారం పక్కాగా లేకపోవడం కూడ అధికారులకు కొంత ఇబ్బంది కల్గిస్తోంది. ప్రమాదం నుండి బయటపడిన వారి నుండి పోలీసులు బోటులో ఎందరు ప్రయాణం చేస్తున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు.ప్రమాదం జరిగిన ప్రాంతంలో సోమవారం నాడు ఉదయం నుండి రాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి.

మంగళవారం నాడు ఉదయం కూడ గాలింపు కొనసాగుతున్నాయి.కచ్చులూరు నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ 80 మంది ఎన్డీఆర్‌ ఎఫ్‌ సభ్యులు, ఒక ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందం, నౌకాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు, నౌకాదళ సిబ్బంది విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినా ఉపయోగం లేకపోయింది.

ఆచూకీ లభ్యం కాని 38 మంది బోటు లోపలే ఉండిపోయారా? గోదావరి దిగువ భాగానికి కొట్టుకుపోయారా అనేది స్పష్టం కాలేదు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచి ఒక మృతదేహం కిందికి కొట్టుకుని పోయినట్టు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహం సముద్రంలోకి వెళ్లి పోయే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

మన అలసత్వం కారణంగానే ఇంత ఘోరం : బోటు ప్రమాదంపై జగన్ ఆవేదన, అధికారులపై ఆగ్రహం

గోదావరిలో బోటు మునక... ప్రమాద ప్రాంతంలో జగన్ ఏరియల్ సర్వే (ఫోటోలు)

బోటు యజమానిపై కేసు నమోదు చేశాం: మంత్రి ఆళ్ల నాని

బోటు ప్రమాదం...మరో నాలుగు మృతదేహాలు లభ్యం

మింగేసే సుడిగుండాలు.. లోతైన ప్రదేశాలు: అక్కడ రెస్క్యూ ఆపరేషన్లూ కష్టమే

అంతులేని విషాదం: ఒకే కుటుంబంలో 12 మంది గల్లంతు

డేంజర్ జోన్ అని చెప్పిన క్షణాల్లోనే తిరగబడిన బోటు: క్షతగాత్రులు

పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్

పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం

పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం

బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం

గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..

అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్

బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి

బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios