Asianet News TeluguAsianet News Telugu

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం వద్ద పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ప్రమాద సమయంలో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు

ap home minister sucharitha comments on boat sunk in godavari
Author
Amaravathi, First Published Sep 15, 2019, 3:41 PM IST | Last Updated Sep 15, 2019, 3:41 PM IST

తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం వద్ద పర్యాటక బోటు మునిగిపోయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. ప్రమాద సమయంలో గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉందన్నారు.

బోటులో 61 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోందని.. ప్రయాణికుల దగ్గర లైఫ్ జాకెట్లు ఉన్నాయని సుచరిత తెలిపారు. గల్లంతైన వారి కోసం పోలీస్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారని హోంమంత్రి వెల్లడించారు.

మరోవైపు గల్లంతైన వారిలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లుగా సమాచారం. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు కచులూరు మందం బయలుదేరాయి.

ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 30 మంది సభ్యులు, ఒక్కో ఎస్‌డీఆర్ఎఫ్ బృందంలో 40 మంది సభ్యులు ఉంటారు. సహాయక చర్యల కోసం పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లను అధికారులు ఘటనాస్థలికి పంపారు.

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios