తూర్పుగోదావరి జిల్లా కచులూరు మందం వద్ద పర్యాటక బోటు మునిగిన ఘటనలో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు. సహాయ చర్యల నిమిత్తం రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌ను ఘటనాస్థలికి పంపారు. అలాగే సుమారు 30 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని ఘటనాస్థలికి పంపారు.

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఫోన్‌లో మాట్లాడి.. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 61 మందితో గండిపోచమ్మ దేవాలయం నుంచి పాపికొండల పర్యటనకు వెళ్తున్న రాయల్ వశిష్ట బోటు కచులూరు మందం వద్ద బొల్తాపడిన సంగతి తెలిసిందే. 

"

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు