Asianet News TeluguAsianet News Telugu

బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం

తూర్పు గోదావరి జిల్లాలో బోటు మునిగిన ఘటనపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బోటు సర్వీసులను నిలిపివేయాలని సీఎం ఆదేశించారు. 

cm jagan orders to stop boat services in state
Author
Guntur, First Published Sep 15, 2019, 4:17 PM IST

అమరావతి: దేవీపట్నం-కచలూరు మధ్య  ఆదివారం నాడు బోటు మునిగిపోయిన ఘటనపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ తో సీఎం వైఎస్ జగన్ ఫోన్ లో మాట్లాడారు.యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ఆదివారం నాడు  బోటు మునిగిపోయిందనే విషయం తెలిసిన వెంటనే సీఎం జగన్ తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌తో పోన్‌లో మాట్లాడారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని సీఎం ఆదేశించారు.నేవీ, ఓఎన్జీసీ హెలికాప్టర్లను సహాయ చర్యల్లో వినియోగించాలని సీఎం జగన్ కలెక్టర్ కు సూచించారు. మరో వైపు ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న  మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఘటనపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులకు సీఎం కోరారు. తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్‌చేయాలని సీఎం కోరారు.
ప్రయాణానికి ఆ బోట్లు అనుకూలమా? కాదా? అన్నదానిపై క్షణ్నంగా తనిఖీచేయాలని ఆధికారులకు సీఎం సూచించారు.

బోట్లు నడిపే వారి లైసెన్సులు లైసెన్స్‌లు పరిశీలించాలని , బోట్లను నడిపేవారు, అందులో పనిచేస్తున్నవారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా తనిఖీచేయాలని సీఎం ఆదేశించారు.  నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు తయారుచేసి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు.

"

సంబంధిత వార్తలు

బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు

పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత

తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు

పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది

కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు

బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం

Follow Us:
Download App:
  • android
  • ios