పడవ ప్రమాదం: అజయ్ కు కేసీఆర్ ఆదేశం, కన్నబాబుతో మాట్లాడిన కేటీఆర్
గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నవారికి తగిన సాయం అందించడానికి అక్కడికి వెళ్లాల్సిందిగా తెలంగాణ సిఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ ను ఆదేశించారు. ఎపి మంత్రి కన్నబాబుతో తెలంగాణ మంత్రి కెటీ రామారావు మాట్లాడారు.
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బోటు ప్రమాదం పట్ల పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు బోటు ప్రమాదం పైన ఆంధ్రప్రదేశ్ మంత్రుల తో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేలా సమన్వయం చేస్తామని కెటిఆర్ చెప్పారు.
ప్రమాదంలో గాయపడినవారు చేరిన ఆస్పత్రికి వెళ్లి, వారికి కావాల్సిన సాయం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ను ఆదేశించారు. ఎపి మంత్రి కన్నబాబుతో కేటీఆర్ మాట్లాడారు. కన్నబాబు ఎపి ప్రభుత్వం నుంచి అన్ని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దాంతో ఆయనతో తాను మాట్లాడినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండలు సమీపంలో లాంచీ మునిగిన ఘటనపై తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లాంచీ ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వారు ఉన్నారని తెలుసుకుని వెంటనే ఆ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ పాటిల్‌తో ఫోన్‌లో మాట్లాడారు.తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.
తూర్పు గోదావరి జిల్లాలోని పాపికొండల వద్ద లాంచీ ప్రమాద ఘటన దురదృష్టకరమని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. దుర్ఘటనలో మరణించినవారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల్లో తెలంగాణవారు కూడా ఉండడంతో అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు.
సంబంధిత వార్తలు
పడవ ప్రమాదం: ప్రధాని మోడీ దిగ్భ్రాంతి, రాహుల్ సంతాపం
పడవ ప్రమాదం: డ్రైవర్లు ఇద్దరూ మృతి, ఆ ప్రాంతంలో సుడిగుండం
బోటు మునక: 41 మంది గల్లంతు, 24 మంది సురక్షితం
గోదావరిలో పడవ మునక: ఆచూకీ దొరికినవారు, గల్లంతైనవారు వీరే..
అమ్మా...! పాపికొండలు పోతున్నా: వరంగల్ వాసి అవినాష్
బోటుపై నిలబడి ప్రాణాలు దక్కించుకొన్నా: వరంగల్ వాసి
బోటు మునక: ప్రమాదంలో చిక్కుకొన్న వరంగల్ వాసులు
బోటు మునక ఎఫెక్ట్: బోటు సర్వీసుల నిలిపివేయాలని సీఎం ఆదేశం
బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం