బోటు ప్రమాదంపై చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు మందం సమీపంలో జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టి.. బాధితులకు అండగా నిలవాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కూడా ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటక బోటు మునిగిపోయిందనే సమాచారం తనను ఎంతగానో బాధించిందని.. సుమారు 50 మంది గల్లంతయ్యారని తెలిసిందన్నారు. పర్యాటకుల ఆచూకీ, ఇతర సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేనాని సూచించారు.
మరోవైపు గల్లంతైన వారిలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లుగా సమాచారం. సహాయక చర్యల కోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు కచులూరు మందం బయలుదేరాయి.
ఒక్కో ఎన్డీఆర్ఎఫ్ బృందంలో 30 మంది సభ్యులు, ఒక్కో ఎస్‌డీఆర్ఎఫ్ బృందంలో 40 మంది సభ్యులు ఉంటారు. సహాయక చర్యల కోసం పర్యాటక శాఖకు చెందిన రెండు బోట్లను అధికారులు ఘటనాస్థలికి పంపారు.
బోటు మునక: ఐదు మృతదేహాల వెలికితీత, కొనసాగుతున్న గాలింపు
పడవ ప్రమాదంపై స్పందించిన హోంమంత్రి సుచరిత
తూ.గో జిల్లాలో బోటు మునిగి 41 మంది ఆచూకీ గల్లంతు
పడవ బొల్తా: రంగంలోకి హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
కచ్చలూరు: ఇదే చోట రెండు ప్రమాదాలు
బోటు మునక:సహాయక చర్యలకు సీఎం జగన్ ఆదేశం