హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు. జగన్ తరఫు న్యాయవాదులు శుక్రవారం సిబిఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. జగన్ కోర్టుకు హాజరు కాలేరని న్యాయవాదులు చెప్పారు. 

జగన్ వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు సిటీ న్యూరో ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే, ఎపి పోలీసులకు జగన్ వాంగ్మూలం ఇస్తాడా, లేదా అనేది ఉత్కంఠగా మారింది. జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. 

వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత జగన్ ను డిశ్చార్జీ చేసే విషయంపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పారు. కాగా, వైఎస్ జగన్ మీద జరిగిన దాడిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. 

జగన్ పై జరిగింది దాడి కాదని, అది హత్యాయత్నమని వారంటున్నారు. పోలీసుల సహకారం లేకుండా ఓ వ్యక్తి విమానాశ్రయంలోకి రాగలరా అని అడుగుతున్నారు. దాడిపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు