Asianet News TeluguAsianet News Telugu

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

దాడిలో జగన్ చేతికి ఎంత లోతు గాయం అయ్యింది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. మొదట అరసెంటీమీటర్ గాయమని చెప్పిన వైద్యులు తర్వాత నాలుగు సెంటీమీటర్లు అని చెప్పడం గమనార్హం.

attack on jagan..doctors about the injury..
Author
Hyderabad, First Published Oct 26, 2018, 10:18 AM IST

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు అనే వెయిటర్.. కోడికాలికి కట్టే కత్తితో జగన్ ఎడమ చేతిపై దాడి చేశాడు.  అయితే..  ఆ దాడిలో జగన్ చేతికి ఎంత లోతు గాయం అయ్యింది అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఎందుకంటే.. మొదట అరసెంటీమీటర్ గాయమని చెప్పిన వైద్యులు తర్వాత నాలుగు సెంటీమీటర్లు అని చెప్పడం గమనార్హం.

జగన్‌ ఎడమ చేతికి 0.5 మిల్లీ మీటరు (అర సెంటీమీటరు) లోతున భుజానికి గాయమైందని  విశాఖలో డాక్టర్లు మొదట చెప్పిన మాట.  గాయాన్ని శుభ్రం చేసి, కట్టుకట్టామని... యాంటీ బయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్‌ వాడాలని చెప్పారు. అయితే... హైదరాబాద్‌లో జగన్‌కు చికిత్స చేసిన సిటీ న్యూరో సెంటర్‌ వైద్యులేమో జగన్‌కు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున గాయమైందని, ఆపరేషన్‌ చేసి తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. 

దీంతో విశాఖలో అర సెంటీమీటరు ఉన్న గాయపు లోతు... హైదరాబాద్‌ చేరుకునే సరికి నాలుగు సెంటీమీటర్లు ఎలా అయ్యిందంటూ చర్చ మొదలైంది. అయితే... కత్తికి విష రసాయనాలు పూశారేమో అని నిర్ధారణ చేసుకునేందుకు వీలుగా శాంపిల్స్‌ను లోతు నుంచి సేకరించాల్సి వచ్చిందని, అందుకే గాయం పెద్దదైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

 

read more news

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

ఆ విషయం తేలాల్సిందే: జగన్ మీద దాడిపై మోహన్ బాబు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios