వైసీపీ అధినేత జగన్ పై గురువారం విశాఖ ఎయిర్ పోర్టులో  ఓ వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. ఈ దాడిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. శ్రీనివాసరావు.. జగన్ పై దాడి చేసేందుకు నెలరోజుల ముందు నుంచే పథకం వేసినట్లు తెలుస్తోంది.

కోడిపందేలు ఇప్పుడేమీ లేవు, పైగా నువ్వు కోడి పందేలూ ఆడవు. కోడి కత్తి నీకెందుకు అన్న తయారీదారు ప్రశ్నకు... నాకు ప్రత్యేకంగా పని ఉందిలే అని శ్రీనివాసరావు స్పష్టంగా చెప్పి తీసుకెళ్లాడు. సుమారు నెల కిందట కోడి కత్తి తయారీదారుడు, జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు మధ్య జరిగిన సంభాషణను స్థానికులు గుర్తు చేస్తున్నారు. దీన్నిబట్టి పక్కా ప్రణాళికతోనే శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్లు స్పష్టమవుతోంది.

అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు కొన్నాళ్ల కిందట శ్రీనివాసరావు సోదరుని కుమార్తె పుట్టినరోజు పండుగ జరిగింది. ఆ సందర్భంగా అయిన వారికి, స్నేహితులకు శ్రీనివాసరావు ధూంధాంగా పార్టీ ఇచ్చారని గ్రామస్తులు గుర్తుచేశారు. వాస్తవంగా అంత పెద్దమొత్తంలో ఖర్చుపెట్టే ఆర్థిక స్థోమత శ్రీనివాసరావుకు లేదని చెపుతున్నారు. వైఎస్‌ జగన్‌పై దాడికి శ్రీనివాసరావును ఎంపిక చేసుకున్నట్లు, భారీగా డబ్బులు ఇచ్చినట్లు స్పష్టమవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

ఆ విషయం తేలాల్సిందే: జగన్ మీద దాడిపై మోహన్ బాబు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు