తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కలెక్టర్ల సమావేశంలో భాగంగా రెండో రోజు జగన్‌పై దాడి, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై సీఎం.. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్ నరసింహన్ అధికార వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారన్నారు.. ఎస్పీలు, సీఐలు, తహశీల్దార్లకు రాష్ట్ర గవర్నర్ నేరుగా ఫోన్లు చేయొచ్చా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

అలా అయితే మేం ఎందుకు.. మంత్రులు ఎందుకున్నట్లు అని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి సీక్రెట్ ఏజెంట్‌గా ఉండటం తప్పించి.. గవర్నర్ వ్యవస్థ వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మరోవైపు ఢిల్లీ పర్యటనలో భాగంగా గవర్నర్ నరసింహన్ ఇవాళ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నారు.

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

జగన్‌పై దాడి: కోర్టుకు రాలేనన్న వైసీపీ అధినేత.. లాయర్‌తో మెమో

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు