జయరామ్ మృతదేహంతో హైద్రాబాద్‌లో రాకేష్ రెడ్డి చక్కర్లు

By narsimha lodeFirst Published Feb 13, 2019, 5:56 PM IST
Highlights

జయరామ్‌ను హత్య చేసిన రోజున ఇద్దరు పోలీసు అధికారులతో పలు దఫాలు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. కారులో జయరామ్ మృతదేహన్ని తీసుకొని నల్లకుంట పీఎస్‌ వద్దకు రాకేష్ రెడ్డి తీసుకెళ్లినట్టు సమాచారం.


హైదరాబాద్: జయరామ్‌ను హత్య చేసిన రోజున ఇద్దరు పోలీసు అధికారులతో పలు దఫాలు మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. కారులో జయరామ్ మృతదేహన్ని తీసుకొని నల్లకుంట పీఎస్‌ వద్దకు రాకేష్ రెడ్డి తీసుకెళ్లినట్టు సమాచారం.

ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో రాకేష్‌రెడ్డి పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్టు సమాచారం. మూడు రోజుల పాటు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డిలను బంజారాహిల్స్  పోలీసులు తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

 డబ్బులను రాబట్టేందుకు ఓ అమ్మాయి జయరామ్‌ను పిలిపించినట్టుగా రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నారని తెలుస్తోంది. గత నెల 31వ తేదీన జయరామ్‌ను మధ్యాహ్నం హత్య చేసినట్టు రాకేష్ రెడ్డి ఒప్పుకొన్నారని సమాచారం. తొలి రోజు రాకేష్ రెడ్డి కొన్ని కీలకమైన విషయాలను వెల్లడించనున్నారు.

జయరామ్ చనిపోయిన తర్వాత ఏం చేయాలనే  విషయమై పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్టుగా గుర్తించారు. నల్లకుంట సీఐ శ్రీనివాసరావు‌తో 13 దఫాలు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డితో 29 దఫాలు రాకేష్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టుగా గుర్తించారు.

కారులోనే జయరామ్‌ మృతదేహాన్ని  సిటీలో తిప్పినట్టుగా గుర్తించారు. ఈ మృతదేహాన్ని కారులో ఉంచుకొనే నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు రాకేష్ రెడ్డి తీసుకెళ్లాడని పోలీసుల విచారణలో  ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది.

జయరామ్ నోట్లో బీరు పోయాలని పోలీసు అధికారులు ఇచ్చిన సలహాతోనే జయరామ్‌ చనిపోయిన తర్వాత ఆయన నోట్లో బీరు పోసినట్టుగా తొలి రోజులో పోలీసులు విచారణలో తెలుసుకొన్నారు. జయరామ్ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ఉద్దేశ్యంతో బీరు పోసినట్టుగా రాకేష్ రెడ్డి ఈ విచారణలో పోలీసులు తెలుసుకొన్నారని సమాచారం. తొలి రోజు విచారణను పోలీసులు గుర్తించారు. రెండో రోజు విచారణ గురువారం నాడు పోలీసులు కొనసాగించనున్నారు.

ఇదిలా ఉంటే ఈ కేసులో రాకేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని గుర్తించిన తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు నల్లకుంట సీఐ శ్రీనివాసరావు, ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసు: జూబ్లీహిల్స్‌కు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

జయరామ్ హత్య కేసు: ఆర్థిక లావాదేవీలపై పోలీసుల ఆరా

జయరామ్ హత్య‌ కేసు: పోలీస్ కస్టడీకి రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు

ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ

అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య

భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

click me!