మావోయిస్టు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన సుధాకర్

By narsimha lodeFirst Published Feb 13, 2019, 4:45 PM IST
Highlights

మావోయిస్టు పార్టీలో చోటుచేసుకొన్న ఇబ్బందికర పరిస్థితుల కారణంగా లొంగిపోయినట్టుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ చెప్పారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఘటనల విషయంలో పార్టీ నాయకత్వం ఎలాంటి  చర్యలు తీసుకోలేదన్నారు

హైదరాబాద్: మావోయిస్టు పార్టీలో చోటుచేసుకొన్న ఇబ్బందికర పరిస్థితుల కారణంగా లొంగిపోయినట్టుగా ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ చెప్పారు. పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఘటనల విషయంలో పార్టీ నాయకత్వం ఎలాంటి  చర్యలు తీసుకోలేదన్నారు. తాను అనేక కమిటీల్లో ఈ విషయాలను చర్చించినట్టు ఆయన చెప్పారు.

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయిన తర్వాత బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.  పార్టీలో ఉంటూ బయటకు వెళ్లే సమయంలో  ఆయుధాలను, నిధులను నేతలు తీసుకెళ్లే సమయంలో  వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదన్నారు.

పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆచరణ ఉన్న నేపథ్యంలో  ఈ విషయాలను అన్ని కమిటీల్లో చర్చించామన్నారు. కానీ, ఈ  విషయాలపై తాను ఏమీ చేయలేనని భావించి తాను లొంగిపోవాలని నిర్ణయం తీసుకొన్నట్టు సుధాకర్ తెలిపారు.

పార్టీ అవసరాల కోసమే పార్టీ కోసం పనిచేసే వారికి డబ్బులను పంపుతామన్నారు. తన సోదరుడి వద్ద రూ. 25 లక్షలు దొరికింది కూడ ఈ రకంగా పంపిందే అనే విషయాన్ని ఆయన  మీడియాకు వివరించారు.  

కింది కమిటీలు వసూలు చేసిన డబ్బులను  పై కమిటీలకు పంపుతాయన్నారు. తన సోదరుడి వద్ద దొరికిన రూ. 25 లక్షలు ఎందుకు పంపామో, ఆ డబ్బు పట్టుబడిన విషయాన్ని కూడ ఏఆర్‌బీ కమిటీకి వివరించినట్టు చెప్పారు.

ఏడాదిన్నర క్రితమే ఈ నిధులు పోలీసులకు పట్టుబడినట్టు ఆయన చెప్పారు. పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై తన భార్యతో కూడ చర్చించామన్నారు. తన భార్య కూడ ఆయా కమిటీల్లో కూడ చర్చించామన్నారు.

సంబంధిత వార్తలు

భార్యతో కలిసి మావోయిస్టు అగ్రనేత సుధాకర్ లొంగుబాటు


 

click me!