కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

By narsimha lode  |  First Published Nov 5, 2018, 5:27 PM IST

కాంగ్రెస్ పార్టీకి సీపీఐ షాకిచ్చింది. తాము పోటీ చేసే 9 అసెంబ్లీ స్థానాల వివరాలను  సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.  



హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి సీపీఐ షాకిచ్చింది. తాము పోటీ చేసే 9 అసెంబ్లీ స్థానాల వివరాలను  సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటించారు.  

తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నట్టుగానే  ప్లాన్ ఏ ప్రకారంగా తాము పోటీ చేసే స్థానాల వివరాలను ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇలానే  ఆలస్యం చేస్తే రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను కూడ ప్రకటించనున్నట్టు  ఆయన ప్రకటించారు.

Latest Videos

సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి సోమవారం నాడు  హైద్రాబాద్‌లోని  పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.మా పార్టీకి ఉన్న బలం ఉన్న  సీట్లను కోరుతున్నట్టు చెప్పారు.  ఇవాళ్టికి కూడ మాకు  కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలమైన సంకేతాలు రాలేదన్నారు.

 ప్లాన్  ఏ ప్రకారంగా తాము పోటీ చేసే  స్థానాల వివరాలను  ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు.ఈ సీట్ల వివరాలను  తమ  భాగస్వామ్యపక్షాలకు కూడ చెప్పామన్నారు.. కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, దేవరకొండ, పినపాక స్థానాలు  కోరినట్టు చెప్పారు.

ఈ స్థానాల విషయమై  కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూల సంకేతాలు వస్తే  సర్దుబాటుకు సిద్దంగా ఉన్నామన్నారు. కానీ కూటమిలో కొన్నిఇబ్బందులున్నాయని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నుండి సానుకూలంగా స్పందనలు రాకపోతే  రెండు మూడు రోజుల్లో  అభ్యర్థులను ప్రకటించనున్నట్టు ఆయన తేల్చి చెప్పారు.

కాంగ్రెస్ పార్టీ దిగి రాకపోతే  మరో 20 స్థానాల్లో కూడ అభ్యర్థులను ప్రకటించనున్నామన్నారు.  తమ పార్టీ రాష్ట్ర కార్యవర్గసమావేశంలో అనుకొన్నట్టుగా ప్లాన్ బి‌ అమలు చేస్తామన్నారు. తమ పార్టీ బలం  ఉన్న చోటే  పోటీ చేయాలని నిర్ణయం తీసుకొందన్నారు. ఈ నిర్ణయం ఆధారంగానే  పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్న సీట్లను ప్రకటించామన్నారు.

సంబంధిత వార్తలు

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!