శేరిలింగంపల్లి టీడీపీలో లొల్లి: టిక్కెట్టు ఎవరికిచ్చినా ఓకే, ఆ ఇద్దరితో మరోసారి చర్చ

By narsimha lodeFirst Published Nov 5, 2018, 4:51 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలోని శేరిలింగంపల్లిలో  అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. 


హైదరాబాద్:  హైద్రాబాద్ నగరంలోని శేరిలింగంపల్లిలో  అసెంబ్లీ నియోజకవర్గంలో  టీడీపీ నేతల మధ్య సమన్వయం కోసం పార్టీ నాయకత్వం రంగంలోకి దిగింది. టిక్కెట్టు ఆశిస్తున్న మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్, మువ్వ సత్యనారాయణలతో మరోసారి సమావేశం కావాలని సమావేశం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకొంది.

శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో  2014  టీడీపీ అభ్యర్థిగా  పోటీ చేసిన అరికెపూడి  గాంధీ విజయం సాధించారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అరికెపూడి గాంధీ టీడీపీ నుండి  టీఆర్ఎస్‌లో చేరారు.

2014 ఎన్నికల్లో  టీడీపీ టిక్కెట్టు ఆశించి టిక్కెట్టు దక్కకపోవడంతో మువ్వ సత్యనారాయణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.  అయితే ఇటీవలనే  మువ్వ సత్యనారాయణ టీఆర్ఎస్ నుండి టీడీపీలో చేరారు. 

శేరి లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం  టీడీపీ టిక్కెట్టును మువ్వ సత్యనారాయణ ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానంలో     మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ (భవ్య ప్రసాద్) కూడ టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్నారు.

మెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ఆదివారం నాడు  శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే   మువ్వ సత్యనారాయణ వర్గీయులు భవ్య ప్రసాద్  ప్రచారాన్ని అడ్డుకొన్నారు. చెప్పులు విసిరారు. ప్రచార వాహనానికి అడ్డుగా నిలిచారు.

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ సమన్వయ కమిటీ  సభ్యులు  ఎన్టీఆర్ భవన్ లో సమావేశమయ్యారు. టిక్కెట్టు ఎవరికిచ్చినా కలిసి పనిచేయాలని  నిర్ణయం తీసుకొన్నారు. మరో వైపు  మెనిగళ్ల ఆనంద ప్రసాద్ , మువ్వ సత్యనారాయణ లతో మరోసారి చర్చించాలని నిర్ణయం తీసుకొన్నారు.

సంబంధిత వార్తలు

శేరిలింగంపల్లి లొల్లి: టీడీపీలో బాహాబాహీ, సైకిల్‌కు సీటొద్దంటున్న బిక్షపతి యాదవ్

శేరిలింగంపల్లి లొల్లి: గాంధీ భవన్ ఎదుట బిక్షపతి ధర్నా, ఇద్దరి ఆత్మహత్యాయత్నం

టీడీపీలో ముసలం: మెనిగళ్లపై మువ్వ వర్గీయులు చెప్పులతో దాడి

click me!