ఉన్నావ్ కేసులో సీబీఐకి సుప్రీం అక్షింతలు: మరిన్ని వార్తలు

By rajesh yFirst Published Aug 1, 2019, 5:45 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ఉన్నావ్ అత్యాచార, హత్య కేసు: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

ఉన్నావ్ అత్యాచారం ఘటనకు సంబంధించిన అన్ని కేసులను ఉత్తర ప్రదేశ్ నుంచి ఢిల్లీకి బదిలీ చేయాలని ఆదేశించింది. అలాగే ఉన్నావ్ బాధితురాలి అత్యాచారం అనంతరం జరిగిన పరిణామాలపై సీబీఐ పూర్తి వివరాలు అందజేయాలని కోరింది.  
 

త్రిపుల్ తలాక్ చట్టం.. రాష్ట్రపతి ఆమోద ముద్ర

త్రిపుల్ తలాక్ విధానం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు 2017లోనే తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ అది కొనసాగుతూనే ఉండటంతో... దానిని చట్ట రూపం దాల్చాలని మోదీ ప్రభుత్వం భావించింది. 

 

మాకు అనుమానం కూడా రాలేదు.. కాఫీ కింగ్ సిద్థార్థ భార్య

కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆత్మహత్యకు ముందు ఆయన ప్రవర్తనలో తమకు ఎలాంటి అనుమానాలు కలగలేదని ఆయన భార్య మాళవిక తెలిపారు. ఉదయం 11గంటలకు ఆఫీసు నుంచి ఫోన్ చేసి సొంత గ్రామానికి వెళ్తున్నాని చెప్పారని.. అప్పుడు కూడా ఆయన నార్మల్ గానే ప్రవర్తించారని ఆమె చెప్పారు.

 

ఉన్నావ్ బాధితురాలి కేసు: బీజేపీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ బహిష్కరణ

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఉన్నావ్‌ బాధితురాలి హత్యాయత్నం కేసులో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ ఎమ్మెల్యే కుల్ దీప్ సెంగార్ పై బహిష్కరణ వేటు వేసింది.  

 

మందు అలవాటులేదు.. నా వీడియోకు ఆడియోను మార్చేశారు: తలసాని

తన వీడియోకు ఆడియోను మార్చేశారంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అసలు మద్యం అలవాటు లేదని.. కానీ తాను మద్యం సేవించి పోతురాజులతో నృత్యం చేసినట్లుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

మున్సిపోల్స్‌పై గులాబీ బాస్‌లో గుబులు... కారణం ఇదేనా..?

ఎనిమిది నెలలో క్రితం తెలంగాణలో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితిలో నాటి స్పీడు ఇప్పుడు లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏదో అనుకుంటే ఇంకేదో జరగడంతో గులాబీ శ్రేణులు కాస్త కలవరపాటుకు గురైయ్యాయి.

 

యాదాద్రిలో జింక మాంసంతో పార్టీ:విందులో పలువురు రాజకీయ నేతలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం రేపుతోంది. మోత్కురు మండలం కొండాపూర్‌లో జింకను వలపన్ని వేటాడి పలువురు విందు చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తోంది.

 

యునాని ఆసుపత్రి ఘటనపై సీపీ సీరియస్, కానిస్టేబుల్ సస్పెండ్

పాతబస్తీ చార్మినార్ యునాని ఆసుపత్రిలో వైద్య విద్యార్ధిని పట్ల దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్‌ పరమేశ్‌‌పై వేటు పడింది. జూనియర్ డాక్టర్ పట్ల కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించాడన్న వార్త తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

వైద్య విద్యార్థి పట్ల పోలీసు అసభ్య ప్రవర్తన... విజయశాంతి వార్నింగ్

మహిళా విద్యార్థుల పట్ల హైదరాబాద్ పోలీసులు అనుచితంగా అసభ్యంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఉందన్నారు.

 

ఊహాశ్రీ మిస్సింగ్... కిడ్నాపర్ రవి శేఖర్ పైనే అనుమానం

కిడ్నాపర్ ఓ కారును దొంగతనం చేసి... ఆ కారులో యువతిని తీసుకుని పరారయ్యాడు. కాగా... మంగళవారం రాత్రి సోనిని ప్రకాశం జిల్లా అద్దంకిలో వదిలేసి వెళ్లిపోయాడు. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కిడ్నాప్ కథ ముగిసింది అనుకోగానే... మరో కిడ్నాప్ కేసు పోలీసుల ముందుకు వచ్చింది.

 

నయీం కేసులో సంచలన విషయాలు: పొలిటికల్, పోలీసుల లింకుల లిస్ట్ విడుదల

నరహంతకుడు నయీం పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యారు. నయీం అనేక భూ దందా, పలు ఆక్రమణల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. నయీం వల్ల అనేక మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. నయీం హతం అనంతరం ఇప్పటి వరకు కేసు విచారణ కొనసాగుతుంది. 

 

జగన్ వస్తే వర్షాలు కాదు, ఉన్న నీరు ఇంకిపోతుంది: భూమా అఖిలప్రియ ఘాటు విమర్శలు

వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ తిట్టిపోశారు. పట్టిసీమపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వైయస్ జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. పట్టిసీమ వల్ల ఉపయోగం లేదని చెప్పిన వైసీపీ ఇప్పుడే అదే నీరును ఎలా విడుదల చేస్తారో చెప్పాలంటూ విరుచుకుపడ్డారు. 
 

వైసీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ..?: జగన్ గూటికి టీడీపీ నేతల క్యూ

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను ఢీ కొట్టాలంటే బొప్పన భవకుమార్ వల్ల సాధ్యం కాదని కొందరు వైసీపీ నేతలు భావిస్తున్నారట. గద్దె రామ్మోహన్ రావుకు చెక్ పెట్టాలంటే బొండా ఉమామహేశ్వరరావు లాంటి నేతలతో అయితే చెక్ పెట్టొచ్చని వైసీపీ భావిస్తోందట. 

 

ఓడిన తర్వాత ఉన్నది కూడా పోయినట్లుందే: పవన్ పై వైసీపీ ఎమ్మెల్యే సెటైర్లు

ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని విమర్శించారు. రెండు చోట్లు పోటీ చేస్తే ఒక్క చోట కూడా పవన్ గెలవలేకపోయాడని, పోటీ చేసిన140 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని విమర్శించారు. ఇలాంటి వ్యక్తి సీఎం జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

 

పవన్ కోటరీకి డబ్బే ముఖ్యం, వార్డు మెంబర్ కూడా కష్టమే: జనసేకు పీవీఆర్ ఝలక్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ ఒక కోటరీ చేరిందని ఆ కోటరీ డబ్బే పరమావధిగా పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. తణుకు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తాను ఎంతో కృషి చేసినట్లు తెలిపారు. నర్సాపురం పార్లమెంటరీ మీటింగ్ లో తనను తప్పించి వేరొకరిని ఇంచార్జ్ గా నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. 

 

రివర్స్ టెండరింగ్ అంటే చంద్రబాబు, దేవినేని ఉమల వెన్నులో వణుకు: విజయసాయిరెడ్డి ఫైర్

ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ అనగానే మీ నాయకుడు చంద్రబాబుకు, నీకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మీలా కుల, వర్గ బలహీనతలు లేవని స్పష్టం చేశారు.  
 

జగన్... వీధి రౌడీలా మాట్లాడుతున్నారు.. టీడీపీ ఎమ్మెల్సీ ఘాటు వ్యాఖ్యలు

కేసీఆర్ తో చీకటి ఒప్పందం చేసుకొని నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. పోలవరం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇలాగే ఉంటే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

 

బందరు పోర్టుని ఎంతకు అమ్మేశారు... జగన్ ప్రభుత్వంపై దేవినేని ప్రశ్నలు

రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే బందరు పోర్టు పనులు చేసే  యంత్రాలు వెనక్కి వెళ్లిపోయాయని వారు ఆరోపించారు. జగన్ ప్రభుత్వం క్విడ్ ప్రోకో ద్వారా తెలంగాణకు ఇచ్చేసిందని విమర్శించారు. తమపై పదేపదే ట్వీట్లు పెట్టే విజయసాయి రెడ్డి  ఇటవల జరిగిన సెర్బియా అరెస్టులపై ఎందుకు ట్వీట్ చేయలేదని  ప్రశ్నించారు.

 

తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ భేటీ, దీనిపైనే చర్చ

ఈనెల 8న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీఎస్ లు, ఉన్నతాధికారుల సమావేశం జరగనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ సమావేశంలో చర్చించే అంశాలు, అజెండాలపై ఇరువురు చర్చించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా గోదావరి జలాలను శ్రీశైలం తీసుకెళ్లే అంశంపై ప్రధానంగా చర్చించ జరిగినట్లుగా సమాచారం.

 

జగన్ నిర్ణయం... పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఇరిగేషన్ శాఖ  ప్రీ క్లోజర్ నోటీసులు జీరీచేసింది. కాగా.. 60సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3వేల కోట్ల విలువైన పులను నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

 

జగన్ ప్రకటనతో వణుకుపుడుతుందా ఉమా... విజయసాయి కామెంట్స్

ఏపీలోని ప్రాజెక్టుల పునులకు రివర్స్ టెండరింగ్ అమల్లోకి తెస్తామని సీఎం జగన్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.కాగా...ఈ ప్రకటనపై ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంలో ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగగా స్పందించారు. మంత్రి దేవినేని టార్గెట్ చేస్తూ... విమర్శలు చేశారు.

 

ఆమె లోదుస్తులు కనిపిస్తుంటే.. సిల్క్ స్మితపై షకీలా షాకింగ్ కామెంట్స్!

ఇప్పుడంటే వెండితెరపైకి శృంగారతారలు చాలా మందే ఉన్నారు. కానీ ఒకప్పుడు సిల్క్ స్మిత ఆ తర్వాత షకీలాకు పేర్లు మాత్రమే ప్రధానంగా వినిపించేవి. స్మిత కెరీర్ ముగింపు దశలో షకీలా సినిమాల్లోకి వచ్చింది. వీరిద్దరూ కలసి కొన్ని చిత్రాల్లో నటించారు కూడా. స్మితకు, షకీలాకు మధ్య విభేదాలు ఉన్నాయి. 

 

మెంటల్ గా, ఫిజికల్ గా రష్మికని ఇబ్బంది పెట్టా.. నటుడి కామెంట్స్!

సినిమా క్లైమాక్స్ లో అర్జున్ ను హీరోయిన్ రష్మిక కొడుతుంది. ఆమె అలా కొట్టినప్పుడు తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెబుతున్నాడు నటుడు రాజ్ అర్జున్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై స్పందించారు. 

 

కాజల్ పేరుతో 60 లక్షలు నిలువు దోపిడి.. మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్!

అందాల చందమామ కాజల్ అగర్వాల్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. సినీ అభిమానుల్లో, యువతలో కాజల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినీ తారల పేరుతో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాలని చూస్తూనే ఉన్నాం. 

 

బిగ్ బాస్ 3: ఎన్టీఆర్ రికార్డ్ బ్రేక్ చేసిన నాగ్.. అదిరిపోయిన టిఆర్పి రేటింగ్!

కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ గా అదరగొడుతున్నాడు. బిగ్ బాస్ 3 తొలి వారం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం రెండవవారం 8 మంది ఇంటి సభ్యుల నామినేషన్ తో రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ షోకి లభిస్తున్న ఆదరణ టిఆర్పి రేటింగ్స్ ద్వారా బయట పడుతోంది. 

 

షాకింగ్ : ఎన్టీఆర్, ప్రభాస్ కాంబో,అరవింద్ ప్లానింగ్..?

రామాయణం సినిమాలో కీలకమైన పాత్రలు రెండు..ఒకటి రాముడు, రెండు రావణాసురుడు. ఈ రెండు పాత్రల చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. ఈ రెండు పాత్రలకు న్యాయం చేయగల ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. 

 

బిగ్ బాస్ 3: ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారంటే..?

ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషన్ అయిన వారు శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్ విట్టా, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాహుల్, పునర్నవి. ఎనిమిది మంది ఎలిమినేషన్ కి నామినేట్ కావడంతో షో ఆసక్తికరంగా మారింది. 

 

బెల్లంకొండపై అరెస్ట్ వారెంట్ షురూ!

తమకు చెల్లించాల్సిన రూ.3.5 కోట్లను తిరిగి ఇవ్వటంలో విఫలమయ్యారని ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ పై ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ కేసు పెట్టింది. వారు కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు బెల్లంకొండపై అరెస్ట్‌ వారెంట్‌ను జారీ చేసింది. 
 

హీరోయిన్ ని ప్రేమ పేరుతో వేధిస్తోన్న హీరో!

తన కూతురిని ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని సినీ నటి తల్లి ఓ హీరోపై ఫిర్యాదు చేయడం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం 'మయూరాన్'.

 

click me!