కేఫ్ కాఫీ డే అధినేత సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆత్మహత్యకు ముందు ఆయన ప్రవర్తనలో తమకు ఎలాంటి అనుమానాలు కలగలేదని ఆయన భార్య మాళవిక తెలిపారు. ఉదయం 11గంటలకు ఆఫీసు నుంచి ఫోన్ చేసి సొంత గ్రామానికి వెళ్తున్నాని చెప్పారని.. అప్పుడు కూడా ఆయన నార్మల్ గానే ప్రవర్తించారని ఆమె చెప్పారు.

ఎక్కడా అనుమానం కూడా కలగలేదని తెలిపారు. ప్రకృతి ప్రేమికుడైన సిద్ధార్థకు అలా వెళ్లే అలవాటు ఉందని చెప్పారు. కాగా... ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆయనతోపాటు కారు డ్రైవర్ ఉన్నాడు. ఆ సమయంలో సిద్ధార్థ ఎలా ప్రవర్తించారనే విషయాన్ని డ్రైవర్ మీడియాకు వివరించారు.

కారులో వెళ్తున్నప్పుడు ఆయన దాదాపు 10 నుంచి 15 ఫోన్లు మాట్లాడారని..డ్రైవర్ బసవరాజ్ పాటిల్ చెప్పారు. ఫోన్ లో అవతలి వ్యక్తులకు ఆయన పదేపదే క్షమాణలు చెప్పినట్లు డ్రైవర్ చెబుతున్నాడు. ఆ తర్వాత నేత్రావతి నది వద్ద కారు ఆపమని ఆయన నడుచుకుంటూ వెళ్లారని చెప్పాడు.

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కాగా.... ఆయన మృతదేహం బుధవారం ఉదయం నేత్రావతి నది లో లభించింది. ఓ వ్యక్తి ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం తాను చూశానంటూ స్థానికులు ఒకరు చెప్పడం గమనార్హం. వ్యాపారంలో లాభాలు రావడంలేదని ఇబ్బందులు ఎక్కువయ్యాయనే బాధతో ఆయన తన బోర్డు సభ్యులకు  లేఖ రాసి మరీ ఈ దారుణానికి పాల్పడ్డారు. సిద్ధార్థ కర్నాటక మాజీ  ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణ అల్లుడు కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

విషాదాంతం: నేత్రావతిలో శవమై తేలిన కాఫీ డే అధినేత సిద్ధార్ధ్

అంతా చట్టప్రకారమే.. సిద్ధార్థను మేం ఇబ్బంది పెట్టలేదు: ఐటీ శాఖ

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: బ్రిడ్జి నుండి దూకడం చూశా, కానీ...

వీజీ సిద్దార్ధ మిస్సింగ్: కీలక సమాచారమిచ్చిన డ్రైవర్

సిద్ధార్థ అదృశ్యం... కేఫ్ కాఫీడే ఉద్యోగులకు సెలవు

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు అదృశ్యం: వంతెనపై నడుస్తూ మాయం

అదృశ్యం కాదు.. ఆత్మహత్య: శవమై తేలిన ఎస్ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్ధ

‘ ఓడిపోయాను’’.. సిద్ధార్థ్ రాసిన లేఖ పూర్తి పాఠం ఇదీ..

వీజీ సిద్ధార్థ ఇష్యూ.. చివరిగా ఫోన్ లో ఎవరితో మాట్లాడారు?

130ఏళ్లుగా సిద్ధార్థ కుటుంబం ఇదే వ్యాపారంలో...