ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ అనగానే మీ నాయకుడు చంద్రబాబుకు, నీకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మీలా కుల, వర్గ బలహీనతలు లేవని స్పష్టం చేశారు.
అమరావతి : మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు వేశారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలపై ట్విట్టర్ వేదికగా నిలదీశారు.
ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ అనగానే మీ నాయకుడు చంద్రబాబుకు, నీకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మీలా కుల, వర్గ బలహీనతలు లేవని స్పష్టం చేశారు.
ఇకపోతే పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రాజక్టుల పనుల్లో పారదర్శకత కోసం రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. రివర్స్ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రివర్స్ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి కొత్త ఇమేజీ తీసుకొస్తానని సీఎం వైఎస్ జగన్ చెబుతుంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావని పచ్చపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
మరోవైపు రివర్స్ టెండరింగ్ పై మాజీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు నిప్పులు చెరిగారు. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గత తెలుగుదేశం ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసుందుకే రివర్స్ టెండరింగ్ అంటూ దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.
ప్రజల వేళ్లపై పోలింగు రోజు వేసిన సిరా మరక ఇంకా చెరగనేలేదు. అప్పుడే గుండెలు బాదుకునే బ్యాచ్ వీధుల్లోకి వచ్చింది. మంగళగిరి ప్రజలు పొర్లించి కొట్టిన మాలోకానికి కాస్త వేచి చూడాలన్న స్పృహ కూడా లేదు. అప్పుడే ఏడుపు లంకించుకున్నాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 1, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 1, 2019, 11:43 AM IST