Asianet News TeluguAsianet News Telugu

జగన్ నిర్ణయం... పోలవరం నుంచి నవయుగ కంపెనీ ఔట్


నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఇరిగేషన్ శాఖ  ప్రీ క్లోజర్ నోటీసులు జీరీచేసింది. కాగా.. 60సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3వేల కోట్ల విలువైన పులను నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Andhra Pradesh govt shocking decession, navayuga out from polavaram project
Author
Hyderabad, First Published Aug 1, 2019, 2:41 PM IST

పోలవరం కాంట్రాక్ట్ పనుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు పనుల నుంచి నవయుగ సంస్థను తప్పించాలని నిర్ణయించింది. నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని ఇప్పటికే నవయుగ సంస్థకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది.

నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ఇరిగేషన్ శాఖ  ప్రీ క్లోజర్ నోటీసులు జీరీచేసింది. కాగా.. 60సీ నిబంధన ప్రకారం 2018 ఫిబ్రవరిలో నవయుగ సంస్థకు హెడ్ వర్క్స్ పనులు అప్పగించారు. రూ.3వేల కోట్ల విలువైన పులను నవయుగకు అప్పగిస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.3220 కోట్ల జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది.

జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు తాజాగా ఇరిగేషన్ శాఖ సూచించింది. కాగా... పోలవరం పనులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ.. ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పోలవరం టెండర్లు, పనుల అప్పగింత, అంచనాల పెంపుతో అవినీతి జరిగిందని నివేదికలో పేర్కొంది.

దీనిపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకొని రివర్స్ టెండర్లకు వెళ్తే దుర్వినియోగాన్ని అడ్డుకునే వీలు ఉంటుందని సూచించింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై కొన్ని రోజులుగా  ఆసక్తికరమైన చర్చ సాగుతుండగా... ఈ రోజు నవయుగ సంస్థను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios