తన కూతురిని ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని సినీ నటి తల్లి ఓ హీరోపై ఫిర్యాదు చేయడం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. దర్శకుడు బాలా శిష్యుడు నందన్ సుబ్బరాయన్ తొలిసారిగా తెరకెక్కించిన చిత్రం 'మయూరాన్'.

ఇందులో అముదవానన్ హీరోగా నటించగా.. మిస్ ఇండియా ఫెమినా కిరీటాన్ని గెలుచుకున్న అశ్మిత హీరోయిన్ గా నటించింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం నాడు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కి హీరో, హీరోయిన్ ఇద్దరూ హాజరు కాలేదు. హీరో వస్తే తన కూతురు రాదని ఆమె తల్లి నిర్మాతలకు చెప్పింది.

కారణం కోటీశ్వరురాలైన తన కూతురిని చిత్ర కథానాయకుడు అముదవానన్ ప్రేమ పేరుతో టార్చర్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసింది. ఇది ఇలా ఉండగా.. సినిమా ప్రమోషన్స్ కి హీరోయిన్ రాకపోతే తానెందుకు రావాలని హీరో వాదిస్తున్నాడని దర్శకనిర్మాతలు ఆరోపణలు చేస్తున్నారు.

ప్రస్తుతం కోలీవుడ్ లో జ్యోతిక నటించిన 'జాక్ పాట్', అలానే 'కళుగు 2' అనే పెద్ద సినిమాల మధ్య తమ సినిమా విడుదల కాబోతుందని, ఇలాంటి సమయంలో సినిమాకి ప్రచారం లేకపోవడం బాధగా ఉందని దర్శకనిర్మాతలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు రాకపోవడంతో ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్ధంకావడం లేదని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.