యాదాద్రి భువనగిరి జిల్లాలో జింక వేట కలకలం రేపుతోంది. మోత్కురు మండలం కొండాపూర్‌లో జింకను వలపన్ని వేటాడి పలువురు విందు చేసుకున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. ఈ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖులు ఉన్నట్లుగా ఆరోపణలు రావడం సంచలనం కలిగిస్తోంది.

మూడు రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా..  కొండాపూర్ అటవీ ప్రాంతంలో జింక ఎముకలను గుర్తించిన కొందరు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. ఎముకలను ఫోరెన్స్ ల్యాబ్‌కు తరలించారు. 

రాజకీయ నేతలు తమ పలుకుబడిని ఉపయోగించి విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురు అనుమానితులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.