కింగ్ నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 హోస్ట్ గా అదరగొడుతున్నాడు. బిగ్ బాస్ 3 తొలి వారం విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం రెండవ వారం 8 మంది ఇంటి సభ్యుల నామినేషన్ తో రసవత్తరంగా సాగుతోంది. బిగ్ బాస్ షోకి లభిస్తున్న ఆదరణ టిఆర్పి రేటింగ్స్ ద్వారా బయట పడుతోంది. 

బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు. ఆ షో ప్రారంభ ఎపిసోడ్ కు 16.1 టిఆర్పి రేటింగ్ నమోదైంది. ఇక నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసిన సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ కు 15.5 రేటింగ్ నమోదైంది. కాగా సీజన్ 3లో తొలి రెండు షోలని అధికమిస్తూ రికార్డు స్థాయిలో టిఆర్పి రేటింగ్ నమోదు కావడం విశేషం. 

నాగార్జున హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సీజన్ 3కి 17. 9 రేటింగ్ నమోదైంది. నాగార్జున హోస్టింగ్ అద్భుతమైన ఆదరణ లభిస్తోందని దీని ద్వారా చెప్పొచ్చు. నాగార్జున అంతకు ముందే మీలో ఎవరు కోటీశ్వరుడు షో ద్వారా ప్రేక్షకులని బుల్లితెరపై మెప్పించాడు. 

జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ గా తొలిసీజన్ ని నడిపించాడు. కానీ నాని హోస్ట్ గా వ్యవహరించిన రెండవ సీజన్లో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి. సీజన్ మాత్రం ఎలాంటి గందరగోళాలకు తావులేకుండా పకడ్బందీగా సాగుతోందని చెప్పొచ్చు.