నరహంతకుడు నయీం పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యారు. నయీం అనేక భూ దందా, పలు ఆక్రమణల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. నయీం వల్ల అనేక మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. నయీం హతం అనంతరం ఇప్పటి వరకు కేసు విచారణ కొనసాగుతుంది.
హైదరాబాద్: నయీం కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నయీం కేసు వివరాలు ఇవ్వాలి ఆర్టీఐకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దరఖాస్తు చేసుకుంది. ఈనేపథ్యంలో ఆర్టీఐ నయీం కేసు వివరాలను వెల్లడించింది.
నయీం కేసులో మాజీ ఎమ్మెల్యేలు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నేతలు, ఏఎస్పీలు, డీఎస్పీలు సీఐ, ఎస్ఐలకు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చూస్తే నయీం కేసులో 21 మంది పోలీసు ఉన్నతాధికారులు, 16 మంది టీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నట్లు ఆర్టీఐ స్పష్టం చేసింది.
బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య పేరు నయీం కేసులో ఉండటం విశేషం. వీరితోపాటు పలువురు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు సైతం ఉన్నారు. నయీం కేసులో ఉన్న అడిషనల్ ఎస్పీలు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, అమరేందర్ రెడ్డిల పేర్లు ఉన్నాయి.
ఇక డీఎస్పీల విషయానికి వస్తే డీఎస్పీ శ్రీనివాస్,సాయి మనోహర్ రావు,ప్రకాశష్ రావు, వెంకట సుబ్బయ్యల పేర్లు ఉన్నాయి. వారితోపాటు పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న పేరు కూడా ఉంది. ఇక ఇన్ స్పెక్టర్ల విషయానికి వస్తే మస్తాన్, శ్రీనివాసరావు, మాజీద్, వెంకట్ రెడ్డి, వెంకట సూర్యప్రకాశ్, రవికిరణ్ రెడ్డి, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్, దినేష్ సాదిఖ్ మియా పేర్లు బయటపడ్డాయి.
నరహంతకుడు నయీం పోలీసుల ఎన్ కౌంటర్లో హతమయ్యారు. నయీం అనేక భూ దందా, పలు ఆక్రమణల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. నయీం వల్ల అనేక మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోంది. నయీం హతం అనంతరం ఇప్పటి వరకు కేసు విచారణ కొనసాగుతుంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 1, 2019, 11:24 AM IST